Troll
Editor · Politics

Price: Rs. 165. ఈ పుస్తకంలోని స్త్రీలు ప్రశ్నించారు. మతతత్వానికి ఎదురుగా నిలబడి లౌకికత సంగతి ఏమిటన్నారు. స్త్రీల శరీరాలపై స్త్రీలకే హక్కు లేదా అన్నారు. మైనార్టీలు కూడా మనుషులే వారికి హక్కులు ఉంటాయన్నారు. కొన్ని కులాలకి ఆధిక్యం ఎందుకు అని అడిగారు, రాజకీయ పార్టీల ప్రహసనాలను కళ్ళకి కట్టారు, మూఢ నమ్మకాలు వద్దు, సైన్స్న నమ్మమన్నారు, ఎవరి ఆహారం వారిష్టమని అన్నారు. వీరంతా భిన్నత్వాన్ని కోరుకున్నారు. వ్రాశారు, మాట్లాడారు, చర్చించారు. అందుకుగాను తీవ్రమైన ట్రోలింగ్ కి గురయ్యారు. పోర్న్ సైట్లలో అమ్మకపు సరుకుగా మార్చబడ్డారు. కేసులు, బూతులు, బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు, నిరంకుశ ఉపదేశాలు-అన్నీ భరించారు. బాధ, దుఃఖం, ఆగ్రహానికి గురవుతూ కూడా తాము నమ్మిన విలువలు, విశ్వాసాల వ్యాప్తి కోసం, నిలిచి పోరాడుతున్న స్త్రీలతో సంభాషణకు తలుపులు తీస్తుంది ఈ పుస్తకం. ఏక మత రాజ్యస్థాపన కోసం భిన్నాభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుపోతున్న వర్తమాన అధికార రాజకీయాల అంధకారంలో ఆశను వాగ్దానం చేస్తుందీ పుస్తకం.