Trikalinga Deshacharithra

Editor · History

Trikalinga Deshacharithra book cover

Price: Rs. 225. ఆచార్య చలం రచించిన ఈ గ్రంథంలో ప్రధానంగా త్రికళింగ అస్తిత్వ మూలాల్ని అర్ధం చేసుకోవడంలో అనార్య, హైందవేతర, తాత్వికత, భావాజాలం, మత, ఆధ్యాత్మికత పాత్రలను సోదాహాణంగా విశ్లేషంచబడింది. ప్రాచీనయుగంలో అనార్య సంస్కృతిని పెంపొందించి ఆదివాసి బహుజన వర్గాల ప్రత్యేక ఆధ్యాత్మిక, మత సంస్కృతిని వ్యాప్తి చేయడంలో అజీవక, జైన, బౌద్ధ దర్శనాల పాత్రను రచయిత విపులంగా పేర్కొన్నారు. త్రికళింగ దేశంలో బ్రాహ్మణీయ ఆధిపత్యం వేళ్లూనుకోడానికి పూర్వం అజీవక సాంప్రదాయం, తీర్ధంకరుల ద్వారా జైన మతం, తాత్వికత, భావజాలం దక్షిణ భారతం అంతటా వ్యాపించింది. బ్రాహ్మాణేతర సంస్కృతి వ్యాప్తి చెందడానికి త్రికళింగ దేశ ప్రత్యేక సామాజిక, భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు దోహదపడినాయి. త్రికళింగ నిర్ధిష్ట వ్యక్తిత్వాన్ని నిర్వచించి విశ్లేషించడం గ్రంథం ప్రత్యేకత. గ్రంథకర్త మాటల్లో “అసలు దక్షిణ పధం కళింగతో ప్రారంభ మవుతుంది. అయితే త్రికళింగ దేశం ఒక్క గంజాం (పాత) విశాఖపట్నం జిల్లాలకే కాదు తూర్పు తీరం అంటే నేటి తూర్పున బర్మా, బంగ్లా ఆర్కాన్ ప్రాంతం వరకు, దిగువన ఉదయగిరి వరకు (తెలంగాణతో కలిపి) వ్యాప్తి చెందిన నిజమైన త్రికళింగ- తెలుగు జాతి దేశం/ ప్రాంతం. ఆంధ్రమనే కల్పిత అంగ, వంగ అనే ఆర్యులు అహంకారంతో చెప్పిన సంకరజాతి ప్రజలు కారు. అలా చెప్పడం వారి దుర్భుద్ది. వారి ఆధిపత్య అంశాలను నేడూ కొనసాగించడం, చరిత్ర గందరగోళం చేయడం నేటి దౌర్భగ్యం." త్రికళింగుల ప్రత్యేక, విశిష్ట అస్తిత్వం కేవలం అంతర్గత అంశాలకే పరిమితం కాలేదు. చారిత్రకంగా త్రికళింగులు విదేశీ వర్తక వాణిజ్యాలను కొనసాగించి విస్తృత స్థాయిలో తమ ఉనికిని, ప్రత్యేకతను చాటుకున్నారు. పురాతత్వ, సాహిత్య ఆధారాల ప్రకారం త్రికళింగ దేశస్తులు చరిత్ర పూర్వయుగం నుండి తూర్పు రేవు పట్టాణాలైన తామ్రలిప్తి, పాలూరు, కళింగపట్నం, కావేరి పట్నం నుండి అండమాన్ మీదుగా బర్మా, మలేషియా సుమిత్ర, బోర్నియో, జావ, బాలి దేశాలతో పాటు రోమ్ తో వర్తకం సాగించినారు. తైలెంగులు అనే త్రికళింగులు ప్రాచీన బర్మాదేశంలో రపడినట్లు చారిత్రక ఆధారాల

Browse more Telugu books