TOLI TARAM TELANGANA KADHAKULU-KADHANA REETULU

Editor · Best Selling

TOLI TARAM TELANGANA KADHAKULU-KADHANA REETULU book cover

Price: Rs. 270. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చిన సాహిత్యం గురించి జరిగినంత పరిశోధన, దానికి ముందు దాని దరిమిలా వెలువడ్డ సాహిత్యం గురించి జరగలేదు. తెలంగాణ సాహిత్య చరిత్రలోని ఈ ఖాళీని పూరించడానికి రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం ఎంతగానో తోడ్పడింది. అందులో భాగంగా తెలంగాణ తొలి తరం కథకుల కథనరీతుల్ని కె.పి అశోక్ కుమార్ అధ్యయనం చేశాడు. 1956 కి ముందు తెలంగాణలో ప్రఖ్యాతులైన, విస్మృతికి గురైన 30 మంది కథకుల జీవిత విశేషాలతో వారి కథా రచనా ప్రస్థానాన్ని వివరిస్తూ అశోక్ కుమార్ రాసిన ఈ పరిశోధనాత్మక పరిచయ వ్యాసాలు తెలంగాణ కథా సాహిత్య చరిత్ర నిర్మాణం లోనే కాదు; నిజాం పాలనలో తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసోద్యమ కాలం నుంచి, సాయుధ రైతాంగ పోరాట కాలం మీదుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు, రెండు తరాల సామాజిక చరిత్ర అవగాహనకు సైతం ఎంతగానో దోహదం చేస్తాయి. ఎ. కె. ప్రభాకర్

Browse more Telugu books