Tippu Sulthan

Editor · History

Tippu Sulthan book cover

Price: Rs. 15. భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాట యోధుడు టిపు సుల్తాన్. 1782లో తండ్రి హైదర్ ఆలి మరణంతో మైసూర్ రాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించి 17 ఏళ్ల పాటు ప్రజారంజకంగానూ, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని భారత భూభాగం నుండి తరిమికొట్టడమే లక్ష్యంగానూ పరిపాలన సాగించాడు. బ్రిటిష్ వారికి సింహస్వప్నమయ్యాడు. టిపు సుల్తాన్ యుద్ధ వీరుడే కాదు, మంచి పాలనా దక్షుడు, పలు భాషల్లో ప్రావీణ్యం కలిగిన మేధావి, కవి. ఫ్రెంచ్ విప్లవంతో యూరప్లో వ్యాపించిన ఆధునిక లౌకిక భావజాలాన్ని భారత దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించిన మొదటి పాలకుడు టిపు సుల్తాన్. పరిపాలనా రంగంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు, ఆయన ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక, వాణిజ్య రంగంలో తీసుకువచ్చిన ఆధునిక పోకడలు, యుద్ధ సాంకేతిక రంగంలో ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు మైసూరు రాజ్యాన్ని ఆనాడు భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. బ్రిటిష్ దాశ్య శృంఖలాల నుండి భారత దేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీభాయి వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించింది. ఆమె కన్నా ఏడు దశాబ్దాల ముందు దేశ మాత విదేశీ ధాస్య శృంఖలాల్లోకి వెళ్లకుండా కాపాడేందుకు వీరోచితంగా పోరాడి నేలకొరిగాడు టిపు సుల్తాన్. ఇరువురూ రాచరిక పాలకులే అయినా భారత దేశం విదేశీ భానిసత్వంలోకి వెళ్లకుండా ఒకరు, విదేశీ బానిసత్వం నుండి విముక్తి కోసం మరొకరు పోరాడి అమరులైనారు. ఝాన్సీ లక్ష్మీభాయి మాదిరిగానే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన అమరుడు టిపు సుల్తాన్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు.

Browse more Telugu books