Tholinalla British Palanalo Bharatha Arthika Vyavasta 1757-1857 ( Bharatha Praja Charithra 25)
Editor · History

Price: Rs. 110. భారత ప్రజాచరిత్ర ప్రస్తుత సంపుటం భారత ఆధునిక ఆర్థిక చరిత్ర సాహిత్యంలో ఖాళీని భర్తీ చేస్తుంది. ఇప్పటివరకు వెలువడిన రచనల్లో బ్రిటిష్ పాలన తొలి దశాబ్దం (1757-1858)కు సంబంధించిన స్థూల వివరణ లోపించింది. మూల గ్రంథంగా పరిగణించబడే ఆర్సి. దత్ ఆర్థిక చరిత్ర వెలువడి ఇప్పటికి వందేళ్ళు దాటిపోయింది. ప్రస్తుత సంపుటం ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలను, వివాదాలను గమనంలోకి తీసుకొంటుంది. బ్రిటిష్ వారి కప్పం తరలింపు, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూసెటిల్మెంట్లు, స్వేచ్ఛా వాణిజ్య విజయం ఫలితంగా భారత ఆర్థికవ్యవస్థలో వచ్చిన మార్పులను సమన్వయ పూర్వకంగా వివరిస్తుంది. సమకాలీన పరిశీలకులు భారత ఆర్థిక వ్యవస్థలో అప్పటి మార్పులను ఎలా వ్యాఖ్యానించారో పేర్కొనడం ఈ సంపుటంలో ఒక గమనించదగిన అంశం. ఇటు సాధారణ పాఠకుని, అటు పరిశోధక విద్యార్థిని ఈ పుస్తకం సంతృప్తి పరుస్తుంది. వలసవాద ఆర్థిక వ్యవస్థ ప్రధాన అంశాలను తెలుసుకో కోరే ప్రతి ఒక్కరు ఈ పుస్తకంలో నూతన అవగాహనలను, సమాచారాన్ని పొందగలుగుతారు.