Tholi Ushassu (Anthology of Poems)

Editor · Stories & Poetry

Tholi Ushassu (Anthology of Poems) book cover

Price: Rs. 59. హరిప్రియ చిన్నపట్ల జ్ఞాన పిపాస, సృజన జిజ్ఞాస కలిగిన తెలివైన విద్యార్థిని. ప్రభుత్వ సిటీ కళాశాలలో బి.కామ్ తృతీయ సంవత్సరం చదువుతుంది. ఒక వైపు చదువుల్లో రాణిస్తూనే, మరొక వైపు సాహిత్య, సాంస్కృతిక, రంగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ, మును ముందుకు సాగిపోతుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని, ఎన్నో బహుమతులను సాధించింది. ఈ యువ కవయిత్రి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జోగిపేట సమీపంలోని కెరూర్ అనే చిన్న పల్లెటూరులో పుట్టింది. తల్లి తండ్రులు చిన్నపట్ల శ్రీలత, విఠల్ గౌడ్. వీరిరువురి ప్రేమ, ఆప్యాయతలే హరిప్రియకు కొండంత అండ. మేడ్చల్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల గురువుల ప్రేరణతో, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు ఆచార్యుల మార్గ దర్శకత్వంలో తెలుగులోనే కాదు ఆంగ్లంలో కూడా మంచి కవిత్వం, కథలు రాస్తుంది.

Browse more Telugu books