THOLI PREMA

ఉమా నూతక్కి /Uma Nuthakki · Novels

THOLI PREMA book cover

Price: Rs. 135. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ రష్యన్ రచయిత, కవి, నాటకకర్త. రష్యన్ సాహిత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన మొదటి రచయితగా ఈయనకు గొప్ప పేరు ఉంది. 1818లో రష్యాలోని ఓరెల్ ప్రాంతంలో ఒక ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, బెర్లిన్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. తుర్గేనెవ్ రచనలు చాలా వాస్తవికంగా ఉంటాయి. ఆయన తన రచనలలో రష్యన్ సమాజంలోని మార్పులను, తరాల మధ్య అంతరాలను చాలా చక్కగా చిత్రించారు. ఆయన రచనలలో ప్రకృతి వర్ణనలు చాలా అందంగా, కవితాత్మకంగా ఉంటాయి. 'తండ్రులు- కొడుకులు' ఆయన రాసిన ప్రఖ్యాత నవల. పాతతరం, కొత్తతరం మధ్య ఉన్న ఘర్షణను ఇందులో అద్భుతంగా చూపించారు. రష్యాలో బానిసత్వానికి వ్యతిరేకంగా చాలా రచనలు చేసారు. అందులో 'మూమూ' ప్రత్యేకమయ్యింది. 'తొలిప్రేమ' ఇది ఒక నవలిక. యవ్వనంలో కలిగే తొలి ప్రేమ అనుభూతులను, దానిలోని బాధను ఇందులో చాలా సున్నితంగా వర్ణించారు. ఇవాన్ తుర్గేనెవ్ రష్యన్ సమాజంలోని సంక్లిష్టతలను, మానవ సంబంధాలను చాలా సున్నితంగా చిత్రించిన గొప్ప రచయిత. ఉమా నూతక్కి గారి ఆనువాదం, సరళంగా మలయమారుతంలా సాగిపోయింది. ఈ రచనను ప్రశాంతంగా చదవండి, ఆస్వాదించండి.

Browse more Telugu books