Tholi Jaadalu

కె.వరలక్ష్మి / k.varalakshmi · Biographies & Auto Biographies

Tholi Jaadalu book cover

Price: Rs. 225. చిన్ననాటి జ్ఞాపకాలు అందరికీ ఇష్టం. కష్టంగా గడిపిన బాల్యం గురించి కూడా కొంతయినా ఇష్టం వుంటుంది. వరలక్ష్మి గారిది మంచి జ్ఞాపకశక్తి. గుర్తుంచుకోవడం కష్టమయిన వయసునుండీ కూడగట్టిన గురుతులను కూడా ఆమె ఈ రచనలో గుదిగుచ్చారు. ప్రధాన రహదారి మీద వున్న ఓ ఊరి పరి ణామాన్ని ఓ అనుభవాల మాలగా కూర్చారు. చుట్టుపక్కల వీధులు, ఇరుగుపొరుగూ, బడి, ఆటలు చదువరుల మనసుల పై ముద్రలు పడే సన్నివేశాలు... ఒకటేమిటి, పాఠకులను ఒక నాటి జగ్గంపేటకు తీసుకెళ్ళి వదిలేస్తారు. ఆమె అలా వుండటానికి పునాది సాకల్యంగా వివరించారు. - పి.ఎ. దేవి, సామాజిక కార్యకర్త కె. వరలక్ష్మి గారు రాసిన ఈ ఆత్మకథలో తన చిన్ననాటి గ్రామీణ జీవితాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. తన కుటుంబంలోని సమస్యలతోపాటు గ్రామీణ జీవన విధానాన్ని, ఆ నాటి ఆడపిల్లలు ఏ వాతావరణంలో ఎదిగారు, పండుగలు, వేడుకలు, ఆచారాలు, పల్లె బతుకును కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. తన స్కూలు జీవితాన్ని ఆమె చాలా అద్భుతుంగా వర్ణించారు. పుస్తకాల చదువు పట్ల ఆమెకు ఏర్పడిన ప్రేమను భవిష్యత్ తరాలకు అందేలా చిత్రీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రమజీవుల కుటుంబాల నుండి వచ్చిన స్త్రీలు ఇప్పటివరకు ఇంత అద్భుతమైన ఆత్మకథను రాసిన దాఖలాలు తక్కువ. ఈ ఆత్మకథలోని జీవితానుభవం చాలా మంది స్త్రీలకు వుండివుండవచ్చు. కానీ, దానికి ఓ రచనా రూపం ఇచ్చి వరలక్ష్మిగారు చాలా మంచి పని చేసారు. ఈ ఆత్మకథను స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా విద్యార్థులు తప్పక చదవాలి. - కంచ ఐలయ్య షెపర్డ్

Browse more Telugu books