Tholi Dhalitha Spoorthi Kusuma Dharmanna
Editor · Novels

Price: Rs. 115. ధర్మన్న పేరునీ, ఆయన కృషినీ తాటి చెట్టంత లోతున గోతిని తవ్వి గత యనభై సంవత్సరాలుగా పాతి పెట్టారు. ఆ గోతిని మళ్ళీ తవ్వి, అందులో దొరికిన కొన్ని సాహిత్య మాణిక్యాల్ని ఆంధ్ర పాఠకులకి అందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. - సి.వి శిష్టుల సాహిత్యమూ సంస్కృతీ ప్రధాన స్రవంతిగా భావించడం వల్లా సారస్వత సృజనలో సర్వస్వాన్ని త్యాగం చేసిన ఎందరో దళిత నాయకులు చరిత్ర పుట్టలోకి ఎక్కకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. అది కుసుమ ధర్మన్న కవి గురించి చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. - శిఖామణి అక్షరాలనూ కూడా బూడిద చేసినా... ఉద్యమ పోరాటానికి అక్షరశక్తికి మరణం ఉండదు. పుట్ల హేమలత కుసుమ ధర్మన్నది తెలుగు సాహితీ లోకంలో ఒక వీరగాధ. - వేముల ఎల్లయ్య కుసుమ ధర్మన్న దళితుల చైతన్య భానుడు. - గూటం స్వామి మాటల తూటాలుగా మలచడం తెలిసిన కవివీరుడు కుసుమ ధర్మన్న గారు. ఇంటిపేరు మెత్తనిది; వంట బట్టించుకున్న ఉద్యమం తీవ్రమయినది. -స్నన్నిధానం నరసింహ శర్మ దళిత రచయితలు తమ స్వీయానుభవాలను నిష్కర్షగా ప్రకటించడం వరకూ పరిణమించిన క్రమంలో కుసుమ ధర్మన్న ఏర్పరచిన మార్గం, కృషి భావి రచయితల మార్గం సుగమం చేసింది. - ఆచార్య కె.ఆశాజ్యోతి