Tholi Dhalitha AthmaGowrava Swaram Kusuma Dharmanna Kavi

Editor · Biographies & Auto Biographies

Tholi Dhalitha AthmaGowrava Swaram Kusuma Dharmanna Kavi book cover

Price: Rs. 40. ధర్మన్న పట్ల గౌరవంతో, ఆరాటంతో చాలా విషయాలు అన్వేషించింది ఆచార్య మధుజ్యోతి. ఏ మామూలు పరిశోధకులైనా తీవ్రంగా వ్యవహరించే సందర్భాలలోకూడా ఆమె సంయమనంతో సూచనలు మాత్రమే చేసి, సహృదయుల నిశ్చయానికి మార్గం చూపింది. 'మాకొద్దీ తెల్ల దొరతనం', 'మాకొద్దీ నల్లదొరతనం' పాటలు రచనలో పూర్వాపరాలు నిర్ణయించటానికి చేసిన యుక్తులు శక్తిమంతంగా ఉన్నాయి. ధర్మన్న 'హరిజనశతకం' ఎంత ఆగ్రహోదగ్రంగా ఉందో ఈమె విడమర్చి చూపింది. ఉపన్యాస సమాచారం తీరుతెన్నులు తెలిపింది. లభించకపోయినా, వ్రాశాడని తెలిసిన కథానికల్ని గూర్చి ప్రస్తావించింది. ధర్మన్న ఉపన్యాసాలలో అగ్నికురవటం, జ్వాలలు రేగటం దర్శించింది. మొదట్లో గాంధీ ఇష్టమైనా, ఆపైన అంబేద్కరు అభీష్టమయి జీవించిన ధర్మన్న వ్యక్తిత్వం స్పష్టం చేసింది. అగౌరవంగా ఉండే మాల, మాదిగ పేర్లు బదులు 'ఆది ఆంధ్ర' వంటి పేర్లు పెట్టుకోవటానికి ప్రభుత్వాల చేత అంగీకరింపజేసిన ధర్మన్న పరిశోధకురాలికి ఆదర్శజీవి. బంగారం పండే ముప్ఫైఎకరాల మాగాణి, నైజాం నవాబు ఇచ్చిన 75 ఎకరాల పంటభూమి, రంగూన్ ఆంధ్రులు ఆరోజుల్లోనే ఇచ్చిన అంతంత పెద్దమొత్తాలు, ధర్మన్న మరణించిన కొద్దికాలానికే శూన్యమయిపోవటం చూస్తే దిగులు కలుగుతుంది. కుసుమ ధర్మన్నను గూర్చి ఇంత సమాచారం. ఇంతకుముందు ఒక్కచోట ఇంత స్పష్టంగాలేదు. ఈ పుస్తకం ఆలోచనాగ్రంగా, పరిశీలన పరవశంగా, వివేకోదయంగా ఉంది.

Browse more Telugu books