Tholi Adugulu

అక్కినేని కుటుంబరావు / Akkineni Kutumbarao · Novels

Tholi Adugulu book cover

Price: Rs. 135. ఇదొక పార్శ్వంలో చూస్తే చారిత్రక నవల. రూడార్ధంలో కాదు. కొన్ని శతాబ్దాలకిందటి చరిత్ర కాదిది. సమకాలీన (Contemporary) చరిత్ర, ఇటీవల చరిత్ర పరిశోధనల్లో సమకాలీనత బలంగా చోటుచేసుకొంది. దీనికొక ప్రాముఖ్యతవుంది. ఈ చరిత్రకు ఆనవాళ్ళు ప్రత్యేకించి దస్తావేజుల్లో, కైఫీయతుల్లో దొరకవు, వ్యక్తులు రాసుకొన్న డైరీలు, ఉత్తరాలు, మౌఖిక సాక్ష్యాలే కాకుండా, కల్పనా సాహిత్యం కథలు, నవలలు మరీ ముఖ్యంగా స్వీయానుభవం, గత కాలపు స్మృతులు ఈ కోవకు చెందిందే యీ నవల. కోస్తాంధ్ర ప్రాంతం, విశాలభారతదేశంలో అంతర్భాగంగా, లోనవుతున్న ఆర్థిక, సామాజిక, కొంత మేరకు సాంస్కృతిక వికాసానికి అద్దం పడుతుంది. నవలకున్న ప్రాముఖ్యత అదే గాక ప్రాసంగికత కూడా. - వకుళాభరణం రామకృష్ణ చదువంటే పరీక్షలు కాదు - బట్టీలు పట్టడం కాదు. మార్కులూ ర్యాంకులూ కాదు - ఒక ఆటా పాటా లేకుండా, ఉదయం నుండి రాత్రి పదింటి దాకా చదువు తప్ప మరో లోకం లేకుండా ఉండటం గాదు "చదువంటే జీవించటం నేర్పాలి జీవితాన్ని ప్రేమించడం నేర్పాలి. బతుకును భారం గాకుండా తియ్యగా బతకడమెట్లాగో నేర్పాలి" అని కూడా బోధిస్తుంది. విడమరుస్తుంది. ముందుకు నడిపిస్తుంది ఈ 'తొలి అడుగులు'. ఒక అపురూప అదృశ్య ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది ఈ నవల. మన బాల్యాన్ని తట్టి లేపుతుంది ఈ నవల! మన పిల్లల బాల్యాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా నేర్పుతుంది ఈ నవల! ఏమీ సంబంధం లేకపోయినా గోర్కీ 'నా బాల్యం', నా బాల్యసేవ గ్రంథాలను గుర్తుకు తెస్తుంది ఈ నవల! ఈ నవల చదవటం పాఠకులకు ఒక మధురమైన అనుభవం! "పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నం కోసం" మీరూ ఈ నవల చదవండి! - సింగమనేని నారాయణ ఈ రచయిత సహజ కవిలాగా సహజ రచయిత. ఐదు నిముషాలలో వీధి మొదలును నాటకాల స్టేజీగా మార్చినట్లు, ఎంతో సహజంగా మనల్ని మన జీవితాల్లోంచి నవల్లో జీవితానికి ఎగుమతి చేస్తాడు. ఇక అక్కడ మనం ఆ పాత్రలలో మమేకమైపోతాం. ఎప్పుడు పుస్తకం అయిపోతుందో ఆ పాత్రలకూ తెలియదు. తొలి అడుగులలో శీను తెలుసుకొన్న జీవిత సత్యాలు ఇష్టమైనవి పొందాలంటే కష్టపడాలి. చదువుకుంటే జీవితం బాగుపడుతుంది. డబ్బు మని

Browse more Telugu books