The Power of Your Subconscious mind (Telugu)
Editor · Best Selling

Price: Rs. 245. మీ జీవితంలో అద్భుతాలకి చోటు కల్పించండి! ఈ ఉత్కృష్ట రచన మీకు కొత్త దారిని చూపిస్తుంది. మీకూ మీరు సాధించాలనుకున్న విజయాలకు మధ్యనున్న మానసిక గోడలను తొలగించడానికి సరళమైన పద్ధతులను నేర్పుతుంది. అవి అత్యంత శక్తివంతమైనవి కూడాను. విప్లవాత్మకమైన ఈ పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది గొప్ప ఫలితాలని సాధించేందుకు సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాసనిపుణుడు డా. జోసెఫ్ మర్ఫీ సాయపడ్డాడు. కేవలం ఆలోచించే విధానంలో మార్పు తెచ్చుకుని ఆ ఫలితాలు ఎలా సాధించవచ్చో వివరించాడు. డా. మర్ఫీ, 'మీరు నిజంగా దేన్నైనా నమ్మి, దాన్ని మీ మనసులో ఊహించుకుంటూ ఉంటే మీ 'సుప్తచేతనలోని అడ్డంకులు దాన్ని సాధించనివ్వవు. కానీ పట్టువిడవకుండా మీరు విజయాలను సాధించినట్టు పదేపదే ఊహించుకుంటూ ఉన్నట్టయితే, ఆ అవరోధాన్ని అధిగమించి విజయాన్ని సాధించగలుగుతారు, అన్న ప్రాథమికసూత్రాన్ని తెలియజేస్తాడు. ప్రేరణని అందించే నిజజీవితంలోని ఉదాహరణలనీ, ఉదంతాలనీ ఈ పుస్తకంలో పొందుపరిచి డా. మర్ఫీ తన పద్ధతుల ప్రభావాన్ని నొక్కి వక్కాణిస్తాడు. తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఎలా సాధించవచ్చో, వివాహబంధాన్ని ఎలా పటిష్టం చేసుకోవచ్చో, స్నేహాలని ఎలా నిలుపుకోవచ్చో, చెడు అలవాట్లని ఎలా వదిలించుకోవచ్చో, భయాలని ఎలా అధిగమించవచ్చో, సంపదను ఎలా సమకూర్చుకోవచ్చో, పదోన్నతులూ, గుర్తింపూ ఎలా పొందవచ్చో... ఇంకా ఇలాంటివే మరెన్నో మనకి అతను వ్యావహారికమైన మార్గనిర్దేశాల ద్వారా తెలియజేస్తాడు. మీ సుప్తచేతనలోని అద్భుతమైన ఇంద్రజాలం వంటి శక్తిని ఉపయోగించుకుని సరళమైన, వ్యావహారికమైన, ఉపయోగకరమైన పద్ధతులనీ, అభ్యాసాలనీ రోజువారీ జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ పుస్తకాన్ని చదవండి. మనిషిలోని సంభావ్యశక్తిని వెలికితీసే ప్రయత్నంచేసేవారిలో డా. మర్ఫీ పేరు ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించుకున్న రచయిత, బోధకుడు, ఉపన్యాసకుడు డా. మర్ఫీ ప్రాచ్యదేశ మత గ్రంథాలని అధ్యయనం చేశాడు. చాలా సంవత్సరాలు భారతదేశంలో నివసించాడు, విస్తృతంగా పరిశోధనలు చేశాడు. ప్రపంచంలోని అన్ని మతాలనీ