THE GORAKHPUR HOSPITAL TRAGEDY A Doctor's Memoir of a Deadly Medical Crisis

Editor · Best Selling

THE GORAKHPUR HOSPITAL TRAGEDY A Doctor's Memoir of a Deadly Medical Crisis book cover

Price: Rs. 290. గోరఖపూర్ ఆసుపత్రి అనగానే మనకు వెంటనే ఏమీ స్ఫురించక పోవచ్చు. కాని ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయిన ఆసుపత్రి అనగానే ఒక్కసారిగా ప్రతి ఒక్కరి మనస్సు కలుక్కుమంటుంది. ఆ దుర్ఘటన జరిగి ఐదేళ్లు అయింది. అయినా ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండి పోయింది ఆ మరణ మృదంగపు హెూరు. ఆనాడు సంబంధిత బాధ్యులెవరూ పట్టించుకోకపోయినా, అక్కడ జూనియర్గా ఉన్న పిల్లల వ్యాధినిపుణుడు డాక్టర్ కఫీల్ ఖాన్ మొత్తం పరిస్థితిని తన అదుపులోకి తీసుకొని నిద్రాహారాలు మాని పిల్లలకు చికిత్స అందించడమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్ల కోసం నానాపాట్లుపడి కొన్నయినా సంపాదించాడు. డాక్టర్ ఖాన్ నిస్వార్ధ కృషి మూలంగా మృతుల సంఖ్య 63 కే పరిమితమయింది. లేకుంటే వందల సంఖ్యలో పిల్లలు చనిపోయి ఉండేవారు. ఇంతా చేస్తే ఆయనకు దక్కిన సత్కారం జైలు నిర్బంధం. న్యాయపోరాటం చేసి బయటకు వస్తే ఆయనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకుండా భర్తరఫ్ చేసి ఇంటికి పంపించారు. డాక్టర్ కఫీలాఖాన్ తాను ఎదుర్కొన్న ఈ అనుభవాలన్నింటినీ తగు డాక్యుమెంటరీ ఆధారాలతో సహా జ్ఞాపకాల రూపంలో అందించాడు. ఈ జ్ఞాపకాలను చదువుతుంటే అవి నిజంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగినవేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కాల్పనిక నవలను చదువుతున్న అనుభూతికి లోనవుతాం. వైద్య వృత్తిలో ఉన్న వారికి, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవారికి ఈ జ్ఞాపకాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి.

Browse more Telugu books