The Best of Yandamoori Veerendranath
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Stories & Poetry

Price: Rs. 117. కథల పుస్తకాల మొదటి ముద్రణకే ఆదరణకు కరువైన ఈ రోజుల్లో, ఈ పుస్తకం ఇన్ని ఎడిషన్లు వచ్చి ఇప్పుడు ఆర్ట్ ప్రింటింగ్లో మరింత అందంగా రావటం, రచయితగా నాకెంతో సంతృప్తినీ, కాసింత గర్వాన్నీ కలగచేస్తుంది. కమర్షియల్ రచనలు మళ్ళీ మళ్ళీ ప్రింటింగ్కి రావటం వేరు. కథలు రావటం వేరు. రచయితకు పాపులర్ ఎంత పేరున్నా, కథల్లో డెప్త్ లేకపోతే ఇన్ని ఎడిషన్లు రావు. కాసింత గర్వం అందుకే. దాదాపు ముప్పై అయిదు సంవత్సరాల తర్వాత (ప్రూఫులు దిద్దటం కోసం) నా మొదటి కథ చదువుతూంటే చాలా ఉద్వేగంగా అనిపించింది. ఈ కథలన్నిటిలోనూ నాకో లక్షణం స్పష్టంగా కనిపించింది. వర్జినిటీ. క్రమక్రమంగా చివరి కథకి వచ్చేసరికి అది మెచ్యురిటీగా మారటం కూడా గమనించాను. ఇది స్వోత్కర్ష కాదు. రచయితగా ముఫ్పై అయిదేళ్ళ చరిత్రని చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం. ఈ కథలపై మీ అభిప్రాయాన్ని వీలైతే తెలియజేయండి.