Tharatharala Bharatha Charithra
Editor · History

Price: Rs. 135. గతం కడుపులో దాగి వుంది ఓ 'నిధి' ఏమిటా నిధి? దాన్ని కనుక్కోడానికి మనకున్న ఆనవాళ్ళేమిటి? ఆధారాలేమిటి? 'నిధి' అంటే మనం పుట్టక పూర్వం వందల, వేల యేళ్ళ క్రిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర. లిపి తెలీని అతి పురాతన కాలం మొదలు లిఖిత ముద్రిత పత్రాలు, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం, కళలు, సాహిత్యం, భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రోమిలా థాపర్ది.