Telugulo samasyapuranalu ,Padya sahityam: Sanga charithra 1900-1950
Editor · Stories & Poetry

Price: Rs. 41. తెలుగులోని పద్యసాహిత్యంనుంచి సంఘ చరిత్రను సేకరించటం కష్టసాధ్యమైన పని. ఇరవయ్యో శతాబ్ది పద్యసాహిత్యం కూడా మన గ్రంథాలయాల దుస్థితివల్ల ఒక పట్టాన దొరకటం లేదు. దొరికినంతలో అందులోని సంఘచరిత్రను సమర్థించటానికి కావలసిన ఆర్థిక సాంస్కృతిక చరిత్రల్లో ఆధారగ్రంథాలు లభించకపోవటం మరో దయనీయస్థితి. ఈ వ్యాసంలో దొరికినంతలో చేతనైనంతలో 1900-1950 మధ్యకాలంలోని తెలుగు పద్య సాహిత్యం ద్వారా తెలియవచ్చే సంఘచరిత్రను వివరించే ప్రయత్నం జరిగింది. చరిత్రాభిమానులూ పద్యకవితాభిమానులూ ఈ వ్యాసాన్ని పరిశీలించి ఇంతకన్నా విపుల గ్రంథరచన చేస్తారని ఆశిస్తున్నాం. అష్టావధానంలో సమస్యాపూరణం ఒక ప్రధానమైన ప్రక్రియ, అష్టావధానంతో నిమిత్తంలేని పద్యక్రీడకూడా. గతంలో ప్రసిద్ధులైనవారు కొందరు చేసిన సమస్యాపూరణలను మళ్ళీ పరిచయం చేసే చిరుప్రయత్నం యిది.