Telugu Prajatheeerpu (1952-2013)
Editor · Best Selling

Price: Rs. 360. 1978లో జర్నలిజంలో ప్రవేశించిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణాజిల్లా గన్నవరంలో పుట్టి పెరిగారు. ఈనాడు పత్రికలో 24 ఏళ్ళ పాటు వివిధ హోదాల్లో 2002 వరకు పనిచేశారు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, న్యూఢిల్లీలలో ఈనాడు దినపత్రిక సీనియర్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2002 ఆగస్టు నుంచి 2006 డిసెంబర్ వరకు ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరో చీఫ్గా పనిచేశారు. 2007 జనవరి నుంచి ఆగస్టు వరకు ఎన్టీవిలో పొలిటికల్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా వున్నారు. 2007 సెప్టెంబర్ నుంచి ఆగస్టు 2009 వరకు టివి6లో ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. తిరిగి 2009 సెప్టెంబర్ నుంచి ఎన్టివిలో చీఫ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. టివి9. ఈటివి2. తేజ టీవిలలో జరిగిన పలు రాజకీయ, రాజకీయేతర చర్చలలో విశ్లేషకుడుగా పాల్గొనేవారు. 2006లో ఎన్టివిలో పొలిటికల్ కామెంట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత దాదాపు రెండేళ్ళపాటు టివి5 లో న్యూస్ స్కాన్, పలు రాజకీయ చర్చలు నిర్వహించారు.