Telugu Paryayapada Nighantuvu
ఆచార్య జిఎన్ రెడ్డి / Acharya G.N. Reddy · Books

Price: Rs. 450. ఆచార్య జి.ఎన్.రెడ్డి గురించి జననం 23-12-1928 * నిర్యాణం 13-07-1989 చిత్తూరు జిల్లా, మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్. రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. "తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం" అనే అంశంమీద పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్. పట్టా వచ్చింది. తెలుగు సెమాంటిక్స్ మీద వీరు చేసిన కూలంకష పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక ప్రసిద్ధ సంస్థలలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. రాక్ ఫెల్లర్ పరిశోధకులుగా పూనాలో కొంతకాలం పనిచేశారు. లెక్చరర్ పదవి నుండి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల స్థాయి వరకు ఎదిగిన సాహిత్యమూర్తి వీరు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా (1984-1987) పదవీ విరమణ చేసిన తర్వాత యు.జి.సి. వీరిని ఎమిరిటస్ ప్రొఫెసర్ గా (1988-89) నియమించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్రాలను సమర్పించారు. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా కొంతకాలం పని చేశారు. వివిధ దేశాలు పర్యటించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్, యం. ఫిల్. డిగ్రీలు పచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీలలో చాలా కాలం సభ్యులుగా వున్నారు. వీరు తెలుగు నిఘంటువు (1973), ఇంగ్లీషు తెలుగు నిఘంటువు (1978), మాండలిక వృత్తి పదకోశం (కుమ్మర, వడ్రంగం) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా వున్నారు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్కృతులపై వివిధ మౌలిక రచనలు చేశారు.