Telugu Novela Sahithyamlo Mano Vishleshana

Editor · History

Telugu Novela Sahithyamlo Mano Vishleshana book cover

Price: Rs. 180. ఒక మహావృక్షాన్ని విశ్లేషించేప్పుడు దాని మూలాల్ని తరచి చూసినట్టే తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణా విభాగాన్ని విశ్లేషించేప్పుడు తెలుగునవలా పరిణామ విశ్లేషణ మనోవైజ్ఞానికపరమైన ప్రపంచ సాహిత్యాల ప్రభావం, ప్రపంచ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సిద్ధాంతాల పరిశీలన కూడా జరిగితేనే ఆ అధ్యయనం సమగ్రం అవుతుంది. అందుకు మనోవిజ్ఞాన శాస్త్రంపై పట్టు ఉండాలి. చాలామంది మానసిక వైద్యులకన్నా ఎక్కువగా రచయితలు, చిత్రకారులు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఆకళింపు చేసుకుని మనసుకు పట్టించుకున్నారు. ఒక బుచ్చిబాబునో, ఒక గోపిచందునో పదేపదే గుర్తుచేసుకుంటున్నామంటే వాళ్లు ఫ్రాయిడ్ ప్రభావాన కొత్త ఆలోచనా ధోరణుల్ని తెలుగుసాహిత్యంలో ప్రవేశపెట్టడమే కారణం. ఇరవయ్యవ శతాబ్దిని అమితంగా ప్రభావితం చేసిన మేధావుల్లో అగ్రగణ్యుడు ఫ్రాయిడ్. డార్విన్ సిద్ధాంతం మేధావుల ఆలోచనల్ని ఎలా మలుపు తిప్పిందో ఫ్రాయిడ్ సిద్ధాంతాలు కూడా అనేక రంగాలమీద అంతే ప్రభావాన్ని చూపాయి. సాహిత్యసృజనపైన అన్నింటికనా ఎక్కువగా ప్రభావం చూపటంతో పాత్ర చిత్రణలో క్రొత్తపుంతలు తొక్కేందుకు రచయితలకు వీలు చిక్కింది. 20వ శతాబ్దపు తొలి అంకంలో అమలినశృంగార భావనతో ప్రారంభమైన భావకవిత్వం ధోరణులు, దానినంటి నడిచిన జాతీయవాద దేశభక్తి సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఎంత సుసంపన్నం చేశాయో మనకు తెలిసిందే! మనోవైజ్ఞానిక మూలసిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారంలోకి రావటంతో సాధారణ ప్రజలక్కూడా 'ఇద్-ఇగో-సూపస్ఇగో'లు మనసును నడిపించే తీరు గురించి అవగాహన ఏర్పడసాగింది. మార్క్స్ చెప్పిన 'ఆర్థిక సమాజం', ఫ్రాయిడ్ చెప్పిన 'మానసిక సమాజం' చెరోవైపునా జాగృతిని కలిగించటంతో ముఖ్యంగా సాహిత్యంలో మేథోపరమైన అనేక మలుపులు చోటు చేసుకోసాగాయి. దానివలన సామాజిక పరిణామాలకు కారణమౌతున్న ఆర్థిక అంశాల గురించి, మానసిక అంశాల గురించి తర్కం మొదలైంది. 'డబ్బు-మనసూ' ఇవి రెండూ 'భూమీ-చంద్రుడూ' లాగా వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తూ చీకటివెలుగుల్ని పొందుతున్న గమనింపు మొదలైంది.

Browse more Telugu books