Telugu Nanartha Pada Nighantuvu
P. RAJESWARA RAO / పి. రాజేశ్వర్ రావు · Books

Price: Rs. 270. తెలుగులో అనేక పదాలకు వివిధ అర్థాలు వున్నాయి. అయితే తెలుగులో నానార్థ పద నిఘంటువులు బహు తక్కువగా వచ్చాయి. తొలిరోజుల్లో నావార్థ పద నిఘంటువులు (5, 6) పద్యరూపంలో వెలువడ్డాయి. ఆ తర్వాత తాళ్ళపాక తిరువేంగళనాథుడు - నానార్ధ శబ్ద నిఘంటువును 220 ఏళ్ళకు పూర్వం వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికీ తెలుగులో నానార్థ పద నిఘంటువులు విడిగా తక్కువగానే వున్నాయి. 2002లో ఆచార్య పి.నరసింహారెడ్డిగారు “లక్ష్మీరామ తెలుగు నానార్ధ పద నిఘంటువు"ను వెలువరించారు. తెలుగులో నానార్థ పద నిఘంటువు నిర్మాణంలో కృషిచేసిన మహనీయులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ నిఘంటు నిర్మాణంలో నాకు ఎన్నో నిఘంటువులు పుపయోగపడ్డాయి. వాటి ఆధారంగా తెలుగు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు, జర్నలిస్టులకు, తెలుగు భాషాభిమానులకు ఉపయోగపడే విధంగా ఈ నిఘంటువును రూపొందించాము. ఇందులో తెలుగు పదాలకేగాక తెలుగు భాషలో కలిసి నిత్యం వాడుకలోవున్న కొన్ని ఆంగ్లం, హిందీ, అరబిక్ పదాలకు కూడా నానార్థాలను చేర్చాము. ఇందులో 12,500ల వదాలకు పైగా నానార్థాలతోపాటు పారిభాషికాలు; వ్యతిరేకార్థాలు; ప్రకృతి-వికృతులు; న్యాయాలు-సూక్తులు; పడిచప్పుళ్ళు; జంటపదాలు; పోలికలు; ఉజ్జీమాటలు...; తెలుగు జాతీయాలు; వ్యత్పత్త్యర్థాలు కూడా చేర్చాం. ఈ నిఘంటువులో తెలుగు సాహిత్యానికి సంబంధించిన దాదాపు అన్ని ముఖ్య విషయాలు చేర్చబడ్డాయి. కనుక దీన్ని "తెలుగు సాహిత్య నిఘంటువు"గా కూడా ఉపయోగించుకోవచ్చు. తెలుగు భాషాభిమానులందరూ దీన్ని ఉపయోగించుకొని లబ్ధిపొందగలరని ఆశిస్తూ...