Telugu - English Dictionary

P. RAJESWARA RAO / పి. రాజేశ్వర్ రావు · Books

Telugu - English Dictionary book cover

Price: Rs. 130. మార్కెట్లో ఎన్నో తెలుగు ఇంగ్లీషు నిఘంటువులుండగా మళ్ళీ ఎందుకీ నిఘంటువు? అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమా పాటలో "అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా" అనే పాట విన్నపుడు 'అరనవ్వును' ఆంగ్లంలో ఏమంటారు అనిపించింది. ఇలాంటివే గాక తరచుగా మనకు వినిపించే అక్షింతలు, మంగళనూత్రం, శోభనం లాంటి పదాలకు ఆంగ్లంలో అర్ధాలు, రెఫ్రిజిరేటర్, ఎటిఎమ్, ఈ-బుక్, యాన్ట్రీ లాంటి ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు ఈ నిఘంటువు ద్వారా తెలుసుకోవచ్చు. అంతేగాక మీరు మీ బంధువుల్లో ఎవర్ని ఎలా పిలవాలో, ఏ వృత్తి పనివారిని ఎలా పిలుస్తారో తెలుసుకోవాలనుకున్నా టైం ఎంతైందో చెప్పాలనుకున్నా ఒకటేమిటి ఇలాంటి ఎన్నో అవసరాలను తీరుస్తుందీ నిఘంటువు.. ఇందులో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మేధావులకు నిత్యం ఉపయోగపడే పదజాలంతో పాటు సాధారణంగా వాడుకలో వుండే టీ.వి. సినిమా పదాలు, జర్నలిస్టులకు, అనువాదకులకు, రచయితలకు ఉపయోగపడే తాజా పదజాలంతో దాదాపు 20,000ల పదాలతో అక్కడక్కడ తెలుగు ఉచ్ఛారణతో రూపొందించడమైనది. ఇందులో 38 విభాగాల్లో వర్గీకృత పదాలు ఉన్నాయి. వంటల పుస్తకాలు వంట ఎలా చేయాలో చెబుతాయి. కాని రుచి మాత్రం వంట చేసేవారిని బట్టి ఉంటుంది. అలాగే ఏ నిఘంటువైనా వడానికి అర్థాన్ని వివరిస్తుంది. కాని వాటిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? వాడాలి అనే నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సింది పాఠకుడే. నిత్య వ్యవహారంలో అందరికీ ఉపయోగపడే విధంగా వీలైనన్ని ఎక్కువ పదాలతో కూర్చాం. కనుక ఈ నిఘంటువు అందరి అవసరాలను కొంతైనా తీరుస్తుందని ఆశిస్తున్నాం.

Browse more Telugu books