Telugetti Jaikottu / తెలుగెత్తి జైకొట్టు

అనంతేజు మోహన్ కృష్ణ / anamteju mohan krishna · Biographies & Auto Biographies

Telugetti Jaikottu / తెలుగెత్తి జైకొట్టు book cover

Price: Rs. 720. తెలంగాణలో ఇప్పుడు ఒక సాంస్కృతిక పునర్నిర్మాణం జరుగవలసిన అవసరం వున్నది. ప్రాదేశికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సాంస్కృతికపరమైన అసమానతలు, సామాజిక వివక్షతలు, మూఢ విశ్వాసాలు, అమానవీయ ఆచారాలు సాగుతూనే ఉన్నాయి. భాషా సాహిత్యాలలో ఇంకా ప్రజాస్వామిక దృక్పథాన్ని సమకూర్చుకోవలసే వుంది. తెలంగాణ లోనే కాదు, తెలుగు నేలంతా సాంస్కృతిక, భాషా సాహిత్య చైతన్యాన్ని ఇంకా పెంపొందించు కోవలసివుంది. ఇప్పుడు మరీ భావజాలరంగంలో తిరోగనున ఆలోచనాధోరణులు పెరుగుతున్నాయి. వీటి నుండి బయటపడే చైతన్యయుత సృజన సాగాలిప్పుడు. అందుకోసం మన గత సాహితీ వారసత్వంలోని ప్రగతిశీల వెలుగు రేఖలను యేరుకొని నవనవోన్మేషంగా నూతనతరాన్ని తీర్చుకోవాలి. గతాన్ని, వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి భవిష్యత్తును నిర్మించు కోవటానికి ఇలాంటి సంకలనాలు మనకు స్ఫూర్తినిస్తాయి. దిశానిర్దేశనం చేస్తాయి.

Browse more Telugu books