Telangani Kaitala Dontulu / తెలంగాణి కైతల దొంతులు
జూపాక సుభద్ర / Jupaka Subhadra · Literature

Price: Rs. 135. జూపాక సుభద్ర తెలంగాణ వచన కవితలో ఉత్తుంగ తరంగం. తెలంగాణ భాషలో వచన కవితను ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా రాయవచ్చని నిరూపించింది. వచన కవిత్వానికి తెలంగాణ భాషా మాధుర్యాన్ని అందించిన తొలి విశిష్ట కవయిత్రి జూపాక సుభద్ర ఒక పోరాట యోధురాలుగా కనిపించే సుభద్ర, దళిత దహనశీల, వచన కవితా సివంగి. -ఆచార్య పులికొండ సుబ్బాచారి ... తెలంగాణ పదాల బలాన్ని, ప్రకృతిలో మెరిసే ఇంద్రధనస్సులా, అర్థవంతంగా సంఘటనల దృశ్యాలను చిత్రీకరించిన ఏకైక కావ్యం ఈ తెలంగాణి. ఏ మనసునైనా తట్టి స్పందింపజేసే చైతన్యం జూపాక సుభద్ర కవిత్వంలో నిండుగా ఉంది. సుభద్ర గారిని తెలంగాణ ఆస్థాన. కవయిత్రిగా మనం గౌరవించుకోవడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. - ఆచార్య గుండెడప్పు కనకయ్య ... జూపాక సుభద్రను వినడం, చదవడం ఎన్నో జీవితాల వడపోత సారాంశం. ఎక్కడ ఆపుదమన్న ఇంకొక పటంలోకి ప్రవహిస్తానే ఉండటం సుభద్ర కవిత్వమహత్యం. రహస్యం. -షాజహానా, కవయిత్రి ... వర్తమాన సామాజిక సమస్యలను గూర్చిన స్పందన సుభద్రలో తారస్థాయిలో ఉంది. జూపాక సుభద్ర తెలంగాణి మాత్రమే గాక, తెలుగు కవితల మాగాణి. తన రాష్ట్రానికి చెందిన భాషలో భాషించడం తమ మూలాల పట్ల కవయిత్రికి ఉన్న నిబద్ధత, నిమగ్నత. నిబిడతను. వ్యక్తీకరించింది. ఇది అభినందనీయం. -నడకుర్తి రత్నజా స్వరూపరాణి, కవయిత్రి ... యీ తెలంగాణి కైతల గుత్తి చదివితే మనకు అర్థమయ్యేది, తాను వస్తువులో నిబిడమై, సొబగైన కైతగా మారిపోవడం సుభద్రకు బాగా తెలిసిన విద్య. జూపాక సుభద్ర తెలంగాణ కవితా చిత్తరువు. మేలిమి సాంస్కృతిక నిధి. - కృపాకర్ మాదిగ, కవి, సామాజిక కార్యకర్త