Telangana Vijayagadha
Editor · Politics

Price: Rs. 160. ఐదేళ్ల అభివృద్ధి పరుగుల వెనుక మహోన్నత లక్ష్యం ఉంది. ఇది మరువరానిది. ఇది నిజంగా విజయోత్సవమే. ఆనందంతో కేరింతలు కొట్టే సమయమిది. చిరునవ్వుల తెలంగాణగా ఈ నేలంతా సకల సౌఖ్యాలతో విరబూయాలనే కేసీఆర్ తలంపు మామూలుది కాదు, ఐదేళ్లలో వేగవంతంగా జరిగే అభివృద్ధి పరంపర వెనుక ఎన్నో ఏళ్ల తెలంగాణ గోస ఉన్నది. ఇది ఉద్యమకాలంలో వెదజల్లబడ్డ ఆగ్రహాం వెనుక ఎంతో దుఃఖం ఉంది. ప్రజల కన్నీళ్లకు తన కన్నీళ్లతో కలుపుకొని ఉప్పొంగితే కదా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యింది. కేసీఆర్వేసే ప్రతి అడుగువెనుక, ఆయన మాట్లాడే ప్రతిమాట వెనుక, ఆయన చేపట్టే ప్రతినిర్మాణం వెనుక బోలెడంత గతముంది, చరిత్ర ఉంది. దాన్ని ఆమూలగ్రంగా అసోసనపట్టిన కేసీఆర్ లక్ష్యసాధకుడున్నాడు. ఆ నిరంతర సాధనే ఈ ఐదేళ్ల అభివృద్ధిగా చూడాలి. తనను తాను పరిపూర్ణంగా లక్ష్యాలకు అంకితం చేసుకోకుండా ఏ నాయకుడూ ఈ అభివృద్ధి సాధించలేడు. కేసీఆర్ను ఈ కోణం నుంచి చూడాల్సి ఉంది. అత్యధికస్థానాలు సంపాదించుకొని ముఖ్యమంత్రులు అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టిన కేసీఆర్ను విశ్లేషించటం చాలా కష్టం. ఎందుకంటే, ఒక ప్రజాప్రతినిధిగా కృషిచేస్తే జరిగేది కాదిది. ఈ మట్టి ఆత్మ తెలిసిధ కేసీఆర్లాంటి వ్యక్తి మాత్రమే ఈ పునర్నిర్మాణాలు చేయగలడు.