Telangana Veeleenam (Vastavalu-vakrikaranalu)
Editor · Politics

Price: Rs. 10. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సెప్టెంబరు 17 చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దీనినొక వివాదం చేసి రెచ్చగొడుతున్నాయి. 'విలీనమా? విమోచనా? విద్రోహమా?’ అన్న చర్చ సాగుతున్నది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రాధాన్యతను యువత ముందుంచే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ సమాజాన్ని నిజాం రాజు నుంచి విముక్తి చేసింది కాంగ్రెసు పార్టీ అని రాష్ట్ర కాంగ్రెసు నాయకులు చెప్పుకుంటున్నారు. విలీన ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆశ్చర్యకరంగా ఎంఐఎం కూడా విలీన దినాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించింది. ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది మరొకదారి అన్నట్టు బీజేపీ మాత్రం వక్రమార్గం వదలలేదు. విమోచన దినోత్సవం పేరుతో విచ్ఛిన్నకర ఎత్తుగడలతోనే ముందుకు సాగుతున్నది. సెప్టెంబర్ 17న చరిత్రలో ఏం జరిగింది? దాని ప్రాధాన్యత ఏమిటి? ఎందుకింత వివాదాస్పదమవుతున్నది? వీటన్నింటిని లోతుగా పరిశీలిస్తుంది ఈ చిన్న పుస్తకం.