Telangana Sayudha poratamlo Bairanpalli (1946-1948)

Editor · Telangana Literature

Telangana Sayudha poratamlo Bairanpalli (1946-1948) book cover

Price: Rs. 179. బైరాన్ పల్లి ప్రజలు అనుభవించిన అమానుషమైన నిర్భంధాన్ని ఈ పుస్తకం చదివేవాళ్ళకు రచయిత చాలా స్పష్టంగా, చాలా బలంగా చెప్పగలిగాడు. ఒకేసారి దాదాపు 150 మందిని చంపడం ఒక భయంకరమైన తెలంగాణ సాయుధ పోరాట అనుభవం. ఇక మహిళల పట్ల జరిగిన అన్యాయం మనసులను కుదిపివేస్తుంది. అనాగరికంగా మహిళలను వివస్త్రలు చేయడం, వాళ్ళ చేలో బతుకమ్మ ఆడించడం, అంతకంటే దుర్మార్గం సైన్యం చేతిలో చనిపోయిన శవాల చుట్టు బతుకమ్మ ఆడించడం పైశాచిక చర్య. ఇలాంటి వాళ్ళలో మనిషి మానవత్వం ఎపుడో చంపబడి ఉంటుంది. ఈ బతికున్న మనుషుల లోపల హృదయము, మేధస్సు ఎప్పుడో పని చేయడం మానేసుంటుంది. వీళ్ళ లోపల శవమే ఉండి ఉంటుంది. ఇవి బతికున్న శవాలు. ఇప్పటికి ఆ కాలం, ఈ సంఘటనలు, అందులో బాధితులు, వృద్ధ మహిళలు కన్నీళ్ళు పెట్టుకొని చెప్పారంటే బాధ ఎంత లోతుగా పాదుకుని ఉందో మనం చూడవచ్చు. రామయ్యగారు ఒక చరిత్ర విద్యార్థిగా తాను ఒక గ్రామ అనుభవం ద్వారా మొత్తం ఉద్యమాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఈ పుస్తకానికి ఎంతో బలాన్నిచ్చింది. - ప్రొ॥ జి.హరగోపాల్

Browse more Telugu books