Telangana Saastraalu

Dr. K. Muthyam / డాక్టర్ కె. ముత్యం · Books

Telangana Saastraalu book cover

Price: Rs. 180. పరస్పర భావ వినిమయమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిందే భాష అది కాలానుగుణంగా, ప్రజల అవసరాల అనుగుణంగా మారుతూ, మార్పుచెందుతూ అనంత ప్రవాహినిగా, జాతి జీవన వ్యవహారంలో కొనసాగుతూవుంది. ప్రతి మనిషి ప్రయత్నంగానో, అప్రయత్నంగానో వారివారి భాషాభివృద్ధికి దోహదపడుతూనే వస్తూవున్నాడు. భాషను కొందరు ఇంపుగా, సొంపుగా వాడి పదబంధాలను, పలుకుబడులను, నుడులను, నానుడులను, చమత్కారాలను, జాతీయాలను, దేశీయాలను, శాస్త్రాలను కూర్చి భాషను అర్థవంతం, సౌందర్యవంతం చేస్తారు. ఇందులో పల్లెప్రజలే ప్రధానపాత్ర పోషిస్తారు. ఈ శాస్త్రాలు, నుదులు, నుడికారాలు, జాతీయాలు, పదాలు, పదబంధాలు ఆ ప్రాంతపు జీవన వ్యవహారంలోని ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అవసరాల, పరిస్థితుల అనుగుణంగా మాండలిక భేదంతో (variations of regional dialects) ప్రచారంలో వుంటాయి. భాషలు వేరైనా ప్రజల విస్తృతానుభవ జన్యమైన వివేకమును సామెత సులభంగా కొద్దిమాటల్లో మనోహరంగా తెలుపుతుంది. తమిళంలో 'పలమొళి' అన్నా, మళయాళంలో 'పంళచొల్లు' అన్నా, తెలుగు, కన్నడ భాషలలో 'నానుడి', 'నాన్నుడి' అన్నా ఇవి ఈ దేశీయ పర్యాయ పదాలన్నిటికీ 'ప్రజల మాట' అనే అర్ధము. సామెతలలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో తుల్యార్థకములు కనిపిస్తాయి. వీటిలో భావనలోనేకాక, భావవ్యక్తీకరణలోకూడా సామ్యము కనిపించుటవల్ల భాషలు వేరైనా జీవన సత్యాలు ఒక్కటే అనే విషయాన్ని గమనించవచ్చు.

Browse more Telugu books