Telangana saahityodyamaalu
Editor · Best Selling

Price: Rs. 400. దాదాపు ముఫ్పై ఏళ్ల పాటు రాసిన వ్యాసాల సంకలనం ఈ గ్రంథం. రచయిత ఒక ప్రణాళికతో క్రమపద్ధతిలో రాయకపోయినప్పటికీ తెలంగాణ సాహిత్యోద్యమాలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ వ్యాసాలు వివరిస్తాయి. ఆ వ్యాసాలను రచయిత ఒక అంశాలవారీగా గ్రంథం రూపంలోకి తీసుకొచ్చారు. తెలంగాణ కవులు, రచయితలు, విమర్శకుల గురించిన వ్యాసాలు ప్రక్రియా పరంగా విభజించబడి, ఆయా ప్రక్రియల పరిణామ క్రమాన్ని సూటిగా తెలియచేస్తుంది ఈ వ్యాససంకలనం. ఏదో ఒకటీ అరా మినహా మిగతా అంతా ఆధునిక భాష, సాహిత్యానికి సంబంధించినది ఈ గ్రంథం. ప్రధానంగా విప్లవ సాహిత్యోద్యమంతో మొదలయి, తెలంగాణ ప్రాంతీయ సాహిత్యోద్యమాల వివరణతో ఈ పుస్తకం ముగుస్తుంది. రచయిత సునిశిత విశ్లేషణకు, సూత్రీకరణలకు, నూతన ప్రతిపాదనలకు ఒరవడి పెట్టింది ఈ రచన. సాహిత్యకారులకు, సాహిత్యాభిమానులకు, ప్రత్యేకించి పోటీ పరీక్షల, పరిశోధక విద్యార్థులకు ఈ గ్రంథం అమూల్యమైనది. కాసుల ప్రతాపరెడ్డి తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్య విమర్శ, అధ్యయనంలో కొత్త ధోరణులను ప్రతిపాదించిన సంచలన విమర్శకులు. జర్నలిజం, విమర్శ, కవిత్వం కథానికా రంగాలలో తనదైన ముద్రను వేశారు. తెలుగు నవల-వ్యాపార ధోరణి అనే అంశంపై ఎం.ఫిల్. చేశారు. ఈ సిద్ధాంత గ్రంథం పత్రికలో సీరియల్గా ప్రచురితమై అనేక చర్చలకు వేదికయింది. శిలువకు తొడిగిన మొగ్గ, ఎల్లమ్మ ఇతర కథలు కథా సంపుటాలతో విభిన్న కథకుడిగాను, గుక్క దీర్ఘ కవితతో వినూత్న కవిగాను గుర్తింపు పొందారు. కొలుపు, ఇరుసు, తెలంగాణ సందర్భాలు, తెలంగాణ సాహిత్యోద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ సాంస్కృతికోద్యమాలు గ్రంథాలు తెలంగాణ సాహిత్యంపై, తెలంగాణ రాజకీయ అంశాలపై కొత్త విశ్లేషణలు, సూత్రీకరణలతో ప్రజాదరణ పొందాయి. తెలంగాణ తోవలు, తెలంగాణ కథ దేవులాట సంకలనాలకు సంపాదకత్వం వహించారు.