Telangana Raitanga Sayuda Poratamlo Kadavendi Prajala Veera Charitra
Editor · History

Price: Rs. 180. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తున్న తరుణంలో దాదాపు సమాంతరంగా సంభవించిన తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశపు భవిష్యత్ రాజకీయ పటాన్ని తీర్చిదిద్దడంలో పెద్ద పాత్ర పోషించిందనేది ఇప్పుడు అంగీకరించబడిన సత్యం. అవి భూసంస్కరణలు కావచ్చు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కావచ్చు లేదా ప్రజలను పీడించిన వెట్టిచాకిరి వంటి భూస్వామ్య విధానపు జాడలను నీడలను వెలుగులోనికి తెచ్చి వాటిని తుదముట్టించడంలో కావచ్చు. ఈ పోరాటం వహించిన ఘనత అసాధారణమైంది. అంతేగాకుండా ఇది భారత విప్లవోద్యమాలకు కూడా మార్గాన్ని చూపించింది. అటువంటి మహత్తర పోరాటానికి కడవెండి గ్రామము మరియు అక్కడ దొడ్డి కొమరయ్య అమరత్వం అనేవి గట్టి పునాదిని వేశాయి. ఆ గ్రామ ఘన చరిత్రను పరిశోధించి వివరించిన గ్రంథం ఇది.