TELANGANA KATHA VARTHAMAANA JEEVANA CHITRANA (1990-2010)
Editor · History

Price: Rs. 360. వలసపాలకులు భారతదేశంలో రాజకీయంగా స్థిరపడుతూ, భారతదేశ అంతరంగిక జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించిన నాళ్ళలోనే భారతీయ కథానిక పురుడుపోసుకుంది. భారతీయ భాషలన్నింటిలో మహాకావ్యం నుంచి కథ, కవిత్వం వేరువేరు ప్రక్రియలుగా రూపొందడం అప్పుడే మొదలయింది. మెకాలే విద్యావిధానం ద్వారా ఆధునిక విశ్వవిద్యాలయాలు ఆవిర్భవించక ముందే భారతీయ కథానిక మొలకెత్తింది. 1832 ప్రాంతంలో పాశ్చాత్య సాహిత్యంలో పుట్టిన కథానిక భారతదేశంలో బెంగాలీ భాషలో పురుడుపోసుకున్నది. అది మెల్లగా ఇతర భారతీయ భాషలలోకి అడుగుపెట్టింది. 1819 ప్రాంతాల నుంచే తెలుగులో వచనం రూపం దాల్చడం మొదలైంది. అది 1879 (ఇప్పటి దాకా లభించిన ఆధారాల ప్రకారం) నుంచే కథారూపం తీసుకుంది. ఈ రకంగా తెలుగు కథకు 142 ఏళ్ళ చరిత్ర ఉంది. 1929 ప్రాంతాలలోని తెలుగులో భాషా సాహిత్య పరిశోధన విశ్వవిద్యాలయాలలో మొదలైనా అవి తెలుగు కథానిక మీద దృష్టి సారించడానికి దాదాపు 1964 దాకా ఆగవలసి వచ్చింది. ఇవాళ కథమీద పరిశోధన చేయడం తిరుగులేని గౌరవనీయ అంశంగా ఉంది.