Telangana Devadasu
Kaluva Mallaiah · Novels

Price: Rs. 130. ధనవంతుడైన పురుషుడు... పేదలను అన్ని రకాలుగా కంట్రోల్ చేయగలరు. కానీ మహిళల విషయానికొస్తే... ఎంత ధనవంతురాలైనా, పేదరాలైనా ఆమె కేరెక్టరు అవమానించడం చాలా సులభంగా జరిగిపోతుంది. అనేక పుకార్లు వ్యాపిస్తాయి. మహిళల పట్ల సమాజంలో ఉన్న ఒక అమానవీయమైన వైఖరిని ఇలా చర్చించారు. తెలంగాణ గదులు కేవలం గడులు కావు. పాపాల పుట్టలు. ఎన్ని అకృత్యాలు, అన్యాయాలు..... ఆ గడుల్లో ఎన్ని జీవితాలను బలైపోయాయో. ఆ దుర్మార్గాలకు నిలయమైన గదులు మాత్రమే కాదు. ఆ గడి భావజాలాలు కూడా కూలిపోవాల్సిందే. ఖాళీ సీసాల్ని పెంటదిబ్బల మీద వేసినట్లుగా పాత భావాలను, పనికిరాని సాహిత్యాన్ని..... దేవదాసుల్ని, ఆ తరహా భావాల్ని ఊడ్చిపారేయాల్సిందే. కాలానుగుణంగా మారితేనే మనుగడ. భావాలు కానీ... మనుషులు కానీ. అదే ఈ తెలంగాణ దేవదాసు చెప్పిన అసలైన సత్యం.