Telangana Bowgolika Vignana Sarvaswam

Editor · Telangana Literature

Telangana Bowgolika Vignana Sarvaswam book cover

Price: Rs. 155. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత తన చరిత్రను తాను రాసుకుంటున్న క్రమంలో తెలంగాణ భౌగోళిక విజ్ఞాన సర్వస్వం రావటం ప్రతి ఒక్కరూ ఆహ్వానించతగింది. ఆధిపత్య సంస్కృతిలో తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు సర్వ స్వతంత్రంగా అన్ని రంగాలలో ఎదిగొస్తున్న తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడాలి. భౌగోళిక శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల తన నేలపై తనకు ప్రేమ కలగటమే గాక ఈ మట్టి రుణం తీర్చుకునేందుకు ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు ఆచరణ రూపంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రతి వారిలో ఈ ఆలోచనలు కలుగచేయటం కంటే మించినది మరొకటి లేదనుకుంటాను. భౌగోళిక తెలంగాణ స్వరూపం, స్వభావం, ఈ నేలపై సంపదలు, పరిశ్రమలు, శీతోష్ణస్థితులు, మృత్తికలు, అడవులు, నదులు, ఖనిజసంపద, జనాభా, పర్యావరణం లాంటి విషయాలను ప్రతి తెలంగాణ బిడ్డ అధ్యయనం చేయాలి. మన వ్యవసాయం, పశుసంపద, నీటిపారుదల వ్యవస్థకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. తెలంగాణ నైసర్గిక స్వరూపం నుంచి మానవాభివృద్ధి, ప్రాంతీయాభివృద్ధిని సమగ్రంగా తెలుసుకోవాలి. తను పుట్టి పెరిగిన నేలపై జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేయాలి. అందుకోసం ఈ పుస్తకం ఎంతో దోహదం చేస్తుంది.

Browse more Telugu books