Tattva Sastram Chinna Parichayam

Ranganayakamma / రంగనాయకమ్మ · Books

Tattva Sastram Chinna Parichayam book cover

Price: Rs. 75. తత్వ శాస్త్రం' మీద నాకు ఎప్పుడూ ఆసక్తి రాలేదు. గతంలో ఆ పుస్తకాలు చదవలేదని కాదు. చదివేది చక్కగా అర్ధమవుతూ వుంటే, అందులో ఏమైనా మంచి విషయం ఉంటే, అది తప్పకుండా నచ్చుతుంది. చదివేది అర్ధం కాకపోతే అందులో మంచి వుందో లేదో, ఏది ఎంత ఉందో తెలిసే అవకాశం ఉండదు. తత్వ శాస్త్ర వ్యాసాలు నేను గతంలో ఎలా చదివానో గానీ, "అది దండగ, టైమ్ వేస్ట్" అనే అభిప్రాయం తోనే ఉండే దాన్ని. ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిందని కాదు. ఆర్నెల్ల కిందట, అనుకోకుండా ఒక తత్వ శాస్త్రం వ్యాసాల పుస్తకం చేతిలో పడితే చదివాను. అది కాస్త అర్ధమైంది. చాలా కోపం వచ్చింది. "పోనీ ఈ తత్వ శాస్త్రం సంగతేమిటో కొంచెం చూద్దాం. చూడకుండా వదిలెయ్యడం ఎందుకు?" అని ఇంట్లో ఉన్న తత్వ శాస్త్ర వ్యాసాల పుస్తకాల కోసం వెతికితే ఏడెనిమిది వరకూ దొరికాయి. వాటి మీద పెన్సిల్తో నేనే గతంలో రాసి పెట్టుకున్న వ్యాఖ్యానాలు కొన్ని కనపడ్డాయి. ఒక పుస్తకం మీద, “చదివాను, అర్థమైతే ఒట్టు!" అని ఉంది. ఇంకో పుస్తకం మీద, "దీన్ని మళ్ళీ ముట్టుకోవద్దు సుమా! తెలివిగా బతకాలి!" అని ఉంది. ఇంకో పుస్తకం మీద, "పోగొట్టుకునే కాలం వెనక్కి రాదు" అని ఉంది. మిగతా పుస్తకాల మీద కూడా అలాంటి కోపం రాతలే ఉన్నాయి. ఒక్క పుస్తకం మీద మాత్రమే "ఇది కొంచెం బాగుంది పాపం" అని ఉంది. నా గుండె ఆగినంత పనయింది. ఆ పుస్తకాలన్నీ చదవాలని కదా తీశాను? ఇప్పుడేం చెయ్యాలి? గతంలో సరిగా అర్ధం చేసుకోలేక అలా రాశానేమో! ఇప్పుడు చదవనా వద్దా? చదవక్కర లేని పుస్తకాలకు అలమార్లలో మాత్రం చోటు ఎందుకు? ఈ సారి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గిర పెట్టుకుని చదవాలి, చదువుతాను అనుకున్నాను. ఒక పూటంతా ఆలోచించి, పుస్తకాల మీద వున్న పాత రాతలన్నీ రబ్బరుతో చెరిపేసి, చెరగని వాటిని పెన్నుతో కొట్టేసి, ఆ గుప్పెడు పుస్తకాల్నీ దగ్గిర పెట్టుకున్నాను. ప్రతీ పుస్తకం లోనూ, ఆ రచయిత, ఆ పుస్తకం రాయడం కోసం చదివిన పుస్తకాల లిస్టు ఉంది. ఆ లిస్టులు చూస్తే, ఇంకో 10 పుస్తకాల దాకా అత్యవసరంగా కావలసి వచ్చింది. నాలుగు రోజుల్లో అవీ దొరికాయి. కావలసిన డిక్ష్నరీలూ ఉన్నాయి ఇంట్లో

Browse more Telugu books