Tathagathuni Adugujadalu
Rani Sarma Emani , Unudurthi Sudhakar / రాణి శర్మ ఈమని , ఉనుదుర్తి సుధాకర్ · History

Price: Rs. 162. బౌద్ధం ఒక చారిత్రక విశేషం మాత్రమే కాదు; సమకాలీన, ఆధునిక సమాజానికి కూడా వర్తించే అంశాలు అందులో అనేకం ఉన్నాయి. కుల, వర్గాలకు అతీతంగా, పురుషులనూ, స్త్రీలనూ సమాన దృష్టితో చూస్తూ, పండితులూ, పామరులూ అనే విభజన చేయకుండా, సాధువులూ, సంసారులూ అనే తేడాలు చూపకుండా రెండువేల సంవత్సరాల క్రితమే ప్రతి ఒక్కర్నీ అక్కున చేర్చుకున్న ఏకైక ధర్మంగా బౌద్ధం ఒక విశిష్టతను సంతరించుకున్నది. ఎవరేది చెప్పినా విశ్వసించనవసరం లేదనీ, ఎవరికి వారు స్వయంగా జ్ఞానాన్వేషణ చేసుకోవాలనీ, ఎవరి మోక్షసాధనకు వాళ్లే పాటుపడాలనీ చెప్పిన ధర్మం అప్పటికీ, ఇప్పటికీ బౌద్ధం ఒక్కటే. బౌద్ధాన్ని అనుసరించే వ్యక్తుల ఆహారపు అలవాట్లపై ధర్మం ఎట్టి నిషేధాలను విధించలేదనీ, బుద్ధుడు మరణించిన కొన్ని వందల ఏళ్ల వరకూ అతడికి విగ్రహపూజలు జరపలేదనీ తెలుసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది.