Tarabai Lekha
Editor · Novels

Price: Rs. 130. * ఎం.ఆర్. దత్తాత్రి ఎం.ఆర్. దత్తాత్రిగారు ప్రసిద్ధ సమకాలీన కన్నడ రచయితల్లో ఒకరు. కథకుడిగా, నవలా రచయితగా, కాలమిస్ట్ గా, కవిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి అత్యంత వైవిధ్యమైన రచనలు ఆలోచనను రేకెత్తించేవి. పట్టణ ఆధునికత, ప్రపంచీకరణ నేపథ్యాలను కలిగినవి. వీరి సాహిత్య కృషికి గుర్తుగా 'ద్వీపవ బయసి', 'మసుకు బెట్టద దారి', 'తారాబాయి పత్ర' నవలలు, 'అలెమారి కనసుగళు' కవితా సంపుటి, 'పూర్వ-పశ్చిమ' వ్యాసాలు, 'పాత్ర వాత్స్య' సాహిత్య విమర్శనాత్మక వ్యాసాల్ని ప్రచురించారు. అనేక సాహిత్య పరస్కారాలు అందుకున్నారు. * రంగనాథ రామచంద్రరావు రంగనాథ రామచంద్రరావు తెలుగు పాఠకులకు రచయితగా, అనువాదకునిగా సుపరిచితులు. వీరి సాహిత్యకృషికి చిహ్నలుగా ఇప్పటిదాకా 3 సొంత కథా సంపుటాలు, 6 అనువాద నవలలు, 13 అనువాద కథా సంకలనాలు, 4 ఆత్మకథలు, సాహిత్య అకాడెమీ కోసం చేసిన 6 అనువాదాలు, 2 సొంత నవలలు, బాలల కోసం రాసిన 10 పుస్తకాలను వెలువరించారు. అనేక సాహిత్య పురస్కారాలతోపాటు సాహిత్య అకాడెమీ కోసం అనువదించిన పి. లంకేశ్ గారి కన్నడ కథ సంపుటి “రాళ్ళు కరిగే వేళ"కు 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం' అందుకున్నారు.