Tamila Anuvada Kathalu
Editor · Stories & Poetry

Price: Rs. 180. తమిళ సాహిత్యం నుంచి వచ్చిన ఎన్నో కథా సంకలనాలు మీరు చదివుండొచ్చు. ఈ సంకలనంలోని కథలు ప్రఖ్యాత తమిళ రచయితలవే అయినప్పటికీ, శైలి పరంగా ఇవి ఎంతో విభిన్నమైన కథలు. ఇందులో స్త్రీవాద కథలు ఉన్నాయి. ప్రేమ కథలు ఉన్నాయి. దళిత కథలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాల కథలున్నాయి. కానీ అన్ని కథలు మానవసంబంధాల్లోని సంక్లిష్టతను ఎత్తి చూపేవే. ప్రాంతం ఏదైనా మన కథలు, వెతలు ఒకటే అని చెప్పే ఈ కథలన్నింటికీ ఒక యూనివర్శల్ అప్పీల్ ఉంది. అందుకే గౌరీ కృపానందన్ ఎంపిక చేసిన ఈ కథల సంకలనం చాలా ప్రత్యేకం.