Sweet home

Editor · Best Selling

Sweet home book cover

Price: Rs. 165. ఈ నవల, 3 భాగాలుగా ఉంది. కానీ, ఇది రాయడం మొదలు పెట్టి నప్పుడు ఇన్ని భాగాలూ, ఇంత కధా నా దృష్టిలో లేవు. విమలా బుచ్చిబాబుల పాత్రలతో మొట్టమొదట 'పాదాల చెంత చోటు' అనే పేరుతో ఒక చిన్న కధ రాశాను. అది ఒక మాసపత్రికలో వచ్చిందిగానీ ఆ పత్రిక పేరు గుర్తు లేదు. తర్వాత, ఆ కథే కొంచెం పెరిగి 'స్వీట్ హోమ్'గా అయింది. 'స్వీట్ హోమ్' మొదటి భాగం రాసింది, 1967లో, రెండో భాగం, 68లో. మూడో 99లో! మొదటి భాగానికీ మూడో భాగానికీ మధ్య దూరం, భాగం 32 సంవత్సరాలు! మూడో భాగం రాసినప్పుడు, 1, 2 భాగాలు చదవలేదు. ఆ పాత్రల స్వభావాలు గుర్తు వుండడం తప్ప, ఆ వెనకటి భాగాల్లో వున్న సంఘటనలు ఎక్కువగా గుర్తు 1996లో, 1, 2 భాగాలు కలిసి ఒకే సంపుటం అయ్యాయి. ఇప్పుడు, 2004లో, 3 భాగాలూ కలిసి ఒకే సంపుటం అవుతున్నాయి. ఇక నించి ఈ సంపుటమే రీ ప్రింటు అవుతూ వుంటుంది. నా పుస్తకాల్ని రీ ప్రింటు సమయాల్లో మళ్ళీ చదివినప్పుడు, చాలా పుస్తకాలు ఎంతో కొంత అసంతృప్తి కలిగిస్తూనే వచ్చాయి. వాటిలో ఇక్కడా అక్కడా దిద్దుళ్ళూ సర్దుళ్ళూ చేస్తూనే వచ్చాను. ఈ పని వెనకటి పుస్తకాల్లోనే ఎక్కువగా జరిగింది. 'స్వీట్ హోమ్' మూడు భాగాల్నీ ఒకే సంపుటంగా చేసే ఈ సందర్భంలో, మొదటి భాగాన్ని ఇప్పుడు చదివితే, అందులో కొన్ని చోట్ల గతంలో కన్నా ఎక్కువ అసంతృప్తి కలిగింది. ఒకటి రెండు సందర్భాల్లో అయితే, 'ఈ భాగాన్ని రీ ప్రింటు లేకుండా ఆపి వేద్దామా' అనే ఆలోచన కూడా సాగింది కొన్ని రోజులు. కానీ, ఇది, ఎంతో మంది ఆడవాళ్ళకూ, కొందరు మగవాళ్ళకు కూడా ఎంతో నచ్చిన కధ. విమలలాంటి భార్యనీ, బుచ్చిబాబు లాంటి భర్తనీ కోరుకున్న పాఠకులు నాకు తెలుసు. మొదటి భాగం వచ్చిన రోజుల్లోనే కాదు, ఇప్పటికీ ఆ భాగాన్ని చదివే పాఠకులు ఆ పాత్రల్ని చూసి చాలా సంతోష పడుతూ వుంటారు. అదంతా గుర్తు తెచ్చుకుంటే, దీన్ని రీ ప్రింటు నించి తీసి వెయ్యడం కాదు గానీ, దీన్ని గతం కన్నా ఎక్కువగా విమర్శ ముందు నిలబెట్టాలి - అనే అభిప్రాయానికి రావలసి వచ్చింది. 1, 2 భాగాల్లో వున్న లోపాలేమిటో ఆ భాగాలకు చివర్లలో రాశాను. 3వ భాగానికి అలాంటి అవసరం కలగలేదు. 3

Browse more Telugu books