Swechhaku Sankellu, Rakasi Koralu
Editor · Politics

Price: Rs. 131. దేశంలో అసహనం పెచ్చుమీరుతోంది. ఎవరి స్వేచ్ఛకు తగ్గట్టు వారు జీవించాలన్న పద్ధతిని తుంగలో తొక్కి తాము నిర్దేశించినట్టే జీవించాలని సంఘపరివార్ శక్తులు శాసిస్తున్నాయి. ఏం తినాలి..? ఏం మాట్లాడాలి..? ఏ దుస్తులు ధరించాలి..? అనే విషయాన్ని వారే నిర్దేశిస్తున్నారు. కాదని ఎదురు నిలిచినవారిపై భౌతికదాడులకు తెగబడుతున్నారు. 2015 తరువాత భావప్రకటనా స్వేచ్ఛ ఒక కలగా మారింది. కల్బుర్గీ, పన్సారి, దబోల్కర్, గౌరీలంకేష్లను పొట్టనపెట్టుకున్నారు. కంచె ఐలయ్య లాంటి దళితవాద రచయితలను బెదిరిస్తున్నారు. పెచ్చుమీరుతున్న అసహనాన్ని వ్యతిరేకిస్తూ, రచయితలపై దాడులను నిరసిస్తూ కొంత మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కిచ్చేసిన పరిస్థితిని చూసాం, గోమాంసం, లవ్ జీహాద్ పేరిట దళితులను, ముస్లిములను, మైనారిటీలను ఊచకోత కోస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తూ పురుషులతో సమానంగా సమాజపురోగతిలో పాలుపంచుకుంటున్న మహిళలను మళ్లీ వంటింటికే పరిమితం చేసే విధానాలు తీసుకొస్తున్నారు. దేశంలో సామరస్యాన్ని కాపాడాల్సిన పాలకులే నిస్సిగ్గుగా భౌతిక దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహిస్తూ వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పత్రికల్లో వెలువడిన వ్యాసాలను సంగ్రహించి వేసిన పుస్తకమే స్వేచ్ఛకు సంకెళ్లు: "ఆరెస్సెస్ నిజ స్వరూపం సంపూర్ణంగా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేసేందుకు, ఈ నేలమీది ప్రజల ఐక్యతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వ శక్తులు మానవతను నామరూపాలు లేకుండా చేసేందుకు అనుసరిస్తున్న భయానకమైన, హేయమైన, ఆటవికమైన పద్ధతులను ఇది చిత్రీకరిస్తోంది.” - పినరయి విజయన్, ముఖ్యమంత్రి, కేరళ “రాష్ట్రీయ స్వయం సంఘ్ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభవాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది. అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్ట