Swechha Samanathva Mahagnijwala Dr. B. R. Ambendkar
Editor · Best Selling

Price: Rs. 405. సమానతను గౌరవించే వారందరికీ అవసరమైన ఆలోచనా సామగ్రిని అందించే పోరాట పరికరాల అక్షర తూణీరం యీ గ్రంథం.. ఇది చరిత్ర కాదు. అంతకుమించింది ఏదైనా వుంటే అది. ఇది ఒక జీవితం. సమగ్ర వ్యక్తిత్వం వున్న నాయకుడి సమగ్ర జీవితం. ఇందులో అంబేడ్కర్ హీరో. అసమానత, అంటరానితనాలే విలన్లు.." -మాడభూషి శ్రీధర్ డాక్టర్ అంబేడ్కర్ జీవితం, పోరాటం, అంతరంగాల సమాహారం యీ గ్రంథం. వర్తమాన సమాజానికి అత్యంత అవసరమైన కరదీపిక యీ గ్రంథం. -ప్రొఫెసర్ పి.డి. సత్యపాల్ సమాజం అంబేడ్కర్ భావాల్ని స్వంతం చేసుకుని వుంటే విప్లవాత్మకమైన మార్పులు త్వరితగతిన సాధ్యమై యుండేవి. ఈ గ్రంథం ఆ అవసరాల్ని గుర్తింపచేస్తుంది. కర్తవ్యాలను పునర్నిర్మించుకోవడానికి తోడ్పడుతుంది. -ఎమ్. వెంకటేశ్వర్లు, ఐ.ఎఫ్.టి.యు. బహుజనుల చేతుల్లో చైతన్య సంపద యీ గ్రంథం. రచించిన తీరు, విశ్లేషించిన తీరు అత్యంత శ్లాఘనీయం. ఎంతో లోతైన కృషి, గాఢమైన తపన వుంటే తప్ప యిటువంటి రచన సాధ్యం అయ్యే విషయం కాదు. - కొత్త శివమూర్తి అంబేడ్కరిజాన్ని అక్షరబద్ధం చేసిన అపూర్వ గ్రంథం. -డాక్టర్ బోని కృష్ణచైతన్య మనం నాగజాతి వారిమి, స్త్రీల హక్కులు, భారత రాజ్యాంగం, ఆయన ఉద్యమాలు, పోరాటాలు.. ఒకటేమిటి.. అన్నింటినీ చరిత్రలతో సహా గుండెకు హత్తుకుపోయేటట్టు రచన చేశారు నటరాజ్ గారు. -డాక్టర్ గూడూరి సీతామహాలక్ష్మి, స్పెక్ట్ చైర్పర్సన్ డాక్టర్ అంబేడ్కర్ జీవితంలోని అద్భుతమైన ఎన్నో విషయాలను పరిమళించే పదరమ్యతలో, అలరించే అక్షర ధారతో, హృదయానికి హత్తుకునేలా, చైతన్యంతో ముందుకు సాగేలా చేసిన యీ రచన అద్భుతం. చిరస్థాయిగా వుండిపోయే గ్రంథం యిది. -సవేరా ఈ గ్రంథం నూతన సాంస్కృతిక భూమిక. కమ్ముకున్న చీకట్లను చీల్చుకువచ్చే వెలుగురేఖ. -డాక్టర్ బొర్రా గోవర్ధన్ నిజమైన అంబేడ్కరిస్టు నటరాజ్ గారు. అంబేడ్కర్ సమాజంలో ఎటువంటి మార్పు రావాలని కోరుకున్నారో ఆ మార్పు నిజంగా రావాలని ఆశిస్తున్న సామాజిక కార్యకర్త ఆయన. ఆయన ఎంతో ఆర్ద్రతతో చేసిన రచన ఇది. -వెంకటమణి ఈశ్వర్, రచయిత