Swatantryaniki Purvam (BHARATA DESAMLO VYAVASAYA RANGAM-UDYAMALU)

Editor · Best Collection

Swatantryaniki Purvam (BHARATA DESAMLO VYAVASAYA RANGAM-UDYAMALU) book cover

Price: Rs. 90. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉండింది. రైతుల ఉద్యమాలు ఎలా కొనసాగాయి, వాటి ఫలితాలు ఇప్పుడెలా ఉన్నాయి అనే విషయాలను స్థూలంగానైనా ఈ పుస్తకంలో వివరించారు. భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయరంగం మీద ఆధారపడి జీవిస్తున్నవాళ్లు అధికం. దేశ విప్లవోద్యమ దిశను నిర్ణయించడంలో ఈ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇట్లాంటి వ్యవసాయ రంగం స్వాతంత్ర్యానికి పూర్వం ఎలా ఉండింది? భూస్వామిక విధానంలో వచ్చిన మార్పులేమిటి? రైతుల పరిస్థితులు ఎలా మారుతూ వచ్చాయి. నీటి పన్నులు, వ్యవసాయ పద్ధతులు ఏ రకంగా ఉండేవి ఉద్యమాలు, తిరుగుబాట్లు రావడానికి కారణాలేమిటి? వాటి ఫలితాలేమిటి? అనే విషయాలు ఇందులో చర్చించారు. భారతదేశ సామాజిక పరిణామాన్ని, చరిత్ర అధ్యయనాన్ని చేస్తున్నవారికి ఈ చిన్న పుస్తకం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు, వ్యవసాయ రైతు ఉద్యమాల్లో వున్న ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం. నేటి దేశ వ్యవసాయ పరిస్థితులు అవగాహన చేసుకోవటానికి ఈ చరిత్ర ఎంతో ఉపకరిస్తుంది.

Browse more Telugu books