Sveccha Vihangalu

Editor · History

Sveccha Vihangalu book cover

Price: Rs. 95. ఇప్పుడు నేను స్వేచ్ఛా విహంగాన్ని, తెలంగాణ సృజనకారునిగా నాకిప్పుడు చాలా వరకు బరువు బాధ్యతలు తగ్గినవి. నేను 1932లో పుట్టాను. నాకు జ్ఞానం వచ్చే వరకు అటు మా ఊళ్ళోను, యిటు నేను చదువుకొనే హనుమకొండలోను - మొత్తం తెలంగాణలోను సాయుధపోరాటాలు జరుగుచుండెను. అత్యాచారాలు, గృహదహనాలు, దోపిళ్ళు, ధూర్త రజాకార్ల ఆగడాలు ఊరూర, వాడవాడల నిత్యకృత్యాలైపోయినవి. నా కండ్ల ముందరే మా ఊరు దగ్ధమైంది. మా చిన తాత గారు రజాకార్ల గుండ్లకు బలియైనారు. మా ఒక్క పల్లె నుండే నలుగురు స్వేచ్ఛార్థులు నేలరాలినారు. నేను చదువుకొనే ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. రజాకార్ల ఆగడాలవల్ల విద్యార్థులు మత విద్వేషాలకు గురి అయినారు. ఆ విధంగా బాల్యమంతా తెలంగాణలో జరిగే అరాచకాలతోనే నిండిపోయింది. నా ఆలోచనలు నాకు తెలియకుండానే తెలంగాణ అంశాలతో నిండిపోయినవి. ఈనాటి భాషలో చెప్పాలంటే నేను తెలంగాణకు 'కమిట్' అయ్యాను. నేను చేసిన ప్రతి పనిలోను తెలంగాణ Undercurrent గా ఉండె. నిజానికి ఆనాటి అఘాయిత్యాలు నిజాం ప్రమేయం లేకుండానే ఆయనకు ఆపాదించడమయింది.

Browse more Telugu books