Suryastamayam
Editor · Novels

Price: Rs. 140. “మనిషి మానవీయుడిగా మిగిలిపోవాలంటే మరణానంతరం కూడా శాశ్వతుడుకావాలి. దానికి పూనిక నడత. ఆ నడత స్వయంకృషికి మూలకం అవుతుంది. ఇదంతా ప్రతీ జీవి జీవితానికి ఒక ఘటనగాకావచ్చు. లేదా ఘర్షణగా కూడా కావచ్చు. అలాంటి స్థితిలో మనిషి ఏ విధమైన పరిస్థితులనెదుర్కుంటాడో అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. నిజానికి ఏ కథకైనా, నవలకైనా ముడిసరుకు జీవితం. జీవితం అనేది ఆదర్శంగా వుండవచ్చు. లేకపోవచ్చు. కాని కథనం మాత్రం సాగుతూనేవుంటుంది. కథ కంచికి చేరుతుందనే మాట వాస్తవమా, అవాస్తవమా అన్న దానికంటే కథ కంచికి చేరడం పుణ్యం అని అనుకుంటే తృప్తి. అలాంటి తృప్తి ఎందరి కథలకుంటుంది అన్నది ప్రశ్న. దానికి సమాధానమే ఈ వచనప్రబంధం. సుందరరావ్ సుందరంగా మలచిన 'సూర్యాస్తమయం' నవల. సుందరరావ్ నవలను మంచి పట్టుతో నడిపారు. సంఘటలను కృతకంగా గాక వాస్తవికతకు నిదర్శనంగా నిరూపణగా తెలియచేశారు. సంభాషణలు, ప్రధానంగా మెడికల్ (హృద్రోగ నిపుణునిగా) టెర్మినాలజీని సందర్భశుద్ధి పాటిస్తూ ప్రయోగించి నవల ప్రయోజనం సిద్ధింపచేశారు. చదివే పాఠకునికి ఈ నవల మితంగా హితాన్ని అందిస్తుంది. ఒక ప్రత్యేక శ్రద్ధతో ఈ నవలను అందించి నవలా ప్రపంచంలో తన స్థానాన్ని స్థిరం చేసుకున్నారు వీరు. సూర్యునికి మరణం లేదు. ఇది ప్రకృతి. ఈ నవల్లో సూర్యునికీ భౌతికంగా మరణం వచ్చింది. చేసిన సేవలపరంగా ఈ నవల్లో సూర్యుడు జ్వాజ్వల్యమానుడే. ఏదేమైనా సూర్యం జీవితం ఆదర్శవంతం. అనంతం. శాశ్వతం. ఇదే ఈ నవలాంతర్యం. - డా॥ నోరి రాజేశ్వరరావు