Sunamudhi Jeevadhara
Editor · History

Price: Rs. 70. శ్రీకాకుళం జిల్లా - సునాముది నది పరీవాహక ప్రాంత మందస జమిందారీ రైతులు 1940లో బ్రిటిష్ పాలనను ప్రతిఘటించారు. జమిందారు దోపిడీని ఎదిరించారు. అడవిపై సాంప్రదాయ హక్కుల కోసం బ్రిటిష్ ఫారెస్టు చట్టాన్ని (1880) సవాలు చేశారు. అప్పుడు బ్రిటిష్ వారు జరిపిన కాల్పుల్లో గున్నమ్మ అనే మహిళతో సహా నలుగురు రైతులు మరణించారు. రెండో ప్రపంచ యుద్ధసమయంలో మందస రైతులు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడం గొప్ప రాజకీయ ప్రాధాన్యమున్న చర్య. తర్వాత సాగిన రైతాంగ పోరాటాల పైనా మందసా రైతాంగ ప్రతిఘటన తన ప్రభావం ప్రసరించింది. శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని, ఇప్పుడు కళింగాంధ్ర వెనుకబాటును పోగొట్టేందుకై సాగే ఉద్యమాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ నేపథ్యం తోడ్పడుతుంది. అనేక చరిత్ర రచనల్లో విస్మరించబడ్డ ఈ ప్రతిఘటనను దానిలో భాగమైన రైతుల జ్ఞాపకాలు, అక్కడి మాలదాసర్లు. గంగిరెద్దుల పాటల ఆధారంతో పునర్ నిర్మించే ప్రయత్నమే ఈ పుస్తకం. ఒక విధంగా రాష్ట్రంలో జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటాల సాధికారిక కథనానికి ఇది సముచితమైన ప్రారంభం అంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తక రచయిత కె.ముత్యం సాహిత్య, సామాజిక విషయాలపై ప్రత్యేకాసక్తితో అధ్యయనం చేస్తున్న పరిశోధకుడు. వృత్తిరీత్యా అధ్యాపకుడు. 'శ్రీకాకుళ రైతాంగ ఉద్యమం- తెలుగు సాహిత్యంపై దాని ప్రభావం అనే అంశంపై వీరి పరిశోధన పుస్తకంగా వెలువడింది. జాతీయోద్యమ సాహిత్యం : గరిమెళ్ళ తదితర పుస్తకాలు రచించారు.