Subhash Chandrabose
Editor · History

Price: Rs. 225. ప్రపంచంలో ఎంతో మంది తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు, సాహితీమూర్తులు పుట్టారు. సమాజం పట్ల తమ కర్తవ్యాలను నిర్వహించి భౌతికంగా కనుమరుగయ్యారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఇప్పటికీ జనం గుండెల్లో నేతాజీగా నిలిచిపోయిన విశిష్ట నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఆయన జీవితం స్వాతంత్ర్యోద్యమం వేర్వేరు కావు. ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాటక్రమంలో ప్రపంచంలోనే నియంతలైన ముస్సోలినీ, హిట్లర్ వంటివారిని స్వయంగా కలిసిన సుభాష్ చంద్రబోస్ తనదైన వ్యక్తిత్వంతో ముందుకుసాగాడు. తన లక్ష్యానికి గాంధీలాంటివారు ఎన్ని ప్రతిబంధకాలను సృష్టించినా తనదైన మార్గంలో సమరశీల సైనికునిగా ఎక్కడా తలవంచని ధీరత్వంతో అజాద్ హింద్ ఫౌజ్ (స్వతంత్ర భారత సేన)ని ఏర్పాటు చేసి క్రియాశీలకంగా వేలాది మందికి మార్గదర్శకునిగా నిలిచారు. ఇరవయ్యో శతాబ్దపు ప్రపంచ చరిత్రలోని కొన్ని కీలకమైన ఘట్టాలు అతని జీవితంతో ముడిపడి ఉ న్నాయి. అవేమిటో ఈ పుస్తకం వివరిస్తుంది. నేతాజీ ఒక వ్యక్తికాదు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలిచిన సామూహికశక్తి అనే వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది. భావితరం నిన్నటి తరాన్ని విస్మరిస్తే జాతిపతనానికి అదే హేతువు అవుతుంది. జాతీయోద్యమానికి, స్వాతంత్య్ర సమరానికి వెన్నపోట్లు పొడిచి, దానికి అంటీముట్టనట్టుగా వ్యవహరించినవారి వారసులు నేడు కుల, మత భావనలను అడ్డం పెట్టుకుని తామే గొప్పనాయకులుగా, పాలకులుగా చరిత్రను వక్రీకరిస్తున్న వేళ ఏది నిజమైన చరిత్రో తెలుసుకుని ఘనమైన వారసత్వాన్ని, స్ఫూర్తినీ హృదయంలో నిలుపుకోవాల్సిన తరుణంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగమే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం