SUBBULU( O Bulli pilla atmakadha)
Editor · Best Selling

Price: Rs. 40. ఈ 'సుబ్బులు, ఓ బుల్లి పిల్ల ఆత్మకథ' అచ్చంగా తెలుగు బాలల సాహిత్యంలో ఒక కొత్త చేరిక.. కొత్త చేరిక అని ఎందుకన్నానంటే ఇది బుల్లి సుబ్బులు నేపథ్యంగా పిల్లల కోసం సుధా భాస్కర్ గారు తనకు తారసపడిన అన్నింటిని అంటే... బడి, గుడి, ఇల్లు, వాకిలి, వాడ, ఆకలి బస్తీలు, బ్యూరోక్రాట్లు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతుల్లో ఆర్థిక ఎదుగుదలతో కలిగే పరిణామాలు, తద్వారా కుటుంబ వ్యవస్థలో కలిగే అకస్మాత్తు మార్పులు వంటివి అనేకం చూపించే ప్రయత్నం చేశారు... అది ఒక చిన్నారి నేపథ్యంగా.. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇది నిజం. ఇంకా ఇందులో వ్యంగ్యం కూడా ఉందోచ్! బాల సాహిత్య లోకంలోకి కొత్త కొత్త అంశాలను, విషయాలను తీసుకుని వస్తున్న 'సుబ్బులు'కు తెలుగు బాలల పక్షాన, బాల వికాసకారుల పక్షాన స్వాగతం పలుకుతున్నాను. దిల్సే ఖుషామదీద్..! జయహో! బాల సాహిత్యం.