States-Minorities

Harathi Vageeshan / హారతి వాగీశన్ · Politics

States-Minorities book cover

Price: Rs. 45. ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రవక్త భారతరత్న డా॥ బి.ఆర్. అంబేడ్కర్. భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్థిక నమూనా ఎలా ఉండాలని ఆయన భావించారో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన, భారత సంయుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్ ఆశించారు. ఆ సమాఖ్యలో సామాజిక ఆర్థిక అసమానతలుండకూడదని ఆయన ఆకాంక్ష. ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది. అంతరాల దొంతరల వర్గ-కుల సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్చా. సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్ ఆలోచనలకు అక్షరరూపం ఈ పుస్తకం. పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, దారుణమైన సామాజిక వివక్షకు గురై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న షెడ్యూల్డు కులాలవారికి ప్రత్యేక హక్కులుండాన్నది అంబేడ్కర్ వాదం. అల్పసంఖ్యాకులు (Minorities) అంటే హిందూమతంలో లేనివారు అన్న తప్పుడు అభిప్రాయానికి అంబేడ్కర్ గట్టి సమాధానం యిస్తారు. షెడ్యూల్డు కులాలు మైనార్టీలకంటే దుర్భర స్థితిలో ఉన్నారని నిరూపించారు. రాజ్యాధార సామ్యవాదం (State Socialism) అంటే ప్రభుత్వం చేతిలో వ్యవసాయం, పరిశ్రమలు ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించవచ్చన్న అభిప్రాయాన్ని, వాదనాపటిమను ఇందులో చూడవచ్చు. అనువాదకులు హారతీ వాగీశన్ ఖిల్లామునూర్ (మహబూబ్నగర్)కు చెందిన రాజనీతతి శాస్త్ర విద్యార్థి. యూ.జీ.సీ ఢిల్లీవాంరి రీసెర్చ్ ఫెలోషిప్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “పంచాయితీరాజ్ వ్యవస్థలో నాయకత్వం" విషయంలో పరిశోధన పూర్తిచేసే దశలో ఉన్నారు.

Browse more Telugu books