STALIN YUGAM
Editor · Politics

Price: Rs. 35. స్టాలిన్పై నేటికీ పాశ్యాత్య దేశాలలో అనేక గ్రంధాలు వెలువడుతూనే ఉన్నాయి. వాటిలో అత్యధికం ఆ మహానేతపై దుమ్మెత్తిపోసేవే. మహత్తర అక్టోబర్ విప్లవంలో లెనిన్తోపాటు కీలక స్థానం వహించిన వ్యక్తి స్టాలిన్. సోవియట్ సోషలిస్ట్లు వ్యవస్థను నిర్మించడంలోను, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నాజీ దురాక్రమణ నుండి ఆ వ్యవస్థను కాపాడటంలోను, ఆ తర్వాత దాని పునర్నిర్మాణంలోను అద్వితీయ పాత్ర పోషించిన చారిత్రక వ్యక్తి స్టాలిన్, ఆయన చనిపోయి ఏభైఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత నాయకత్వం చేసిన ఘోర తప్పిదాల ఫలితంగా సోవియట్ యూనియనూ కుప్పకూలిపోయింది. అయిప్పటికీ స్టాలిన్పై దుష్ప్రచారం ఆగలేదంటే కారణం ఇప్పటికీ ఆయన పీడిత ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలవటమే. స్టాలిన్ మృతి చెందిన కొద్ది కాలానికే అమెరికా పాత్రికేయురాలు అన్నా లూయీ స్ట్రాంగ్ రచించిన ఈ ప్రసిద్ధ గ్రంథాన్ని మరో సారి తెలుగు పాఠకులకు లభిస్తున్నది.