Srungaara Naishadhamu
Srinathudu / శ్రీనాథుని · Telangana Literature

Price: Rs. 95. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా కీర్తించబడ్డ ప్రబంధయుగానికి చెందిన అపూర్వ కావ్యాలను, ఆ యుగానికి ముందు వెనకలుగా వచ్చిన మరికొన్ని మేలిమి కావ్యాలతో కలిపి ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట గతంలో రసజలోకానికొక తెలుగు విందుని అందించటం సుప్రసిద్ధమే. ఏళ్లు గడిచినా తీపి తరగని ఆ విందుని తెలుగువారికి ఎమెస్కో మరొక్కమారు వడ్డిస్తోంది. శ్రీనాథునితో మొదలుకుని సారంగు తమ్మయదాకా ఇందులో చోటు చేసుకున్న కవులు పదిహేను, పదహారు శతాబ్దాల్లో ఆంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాంస్కృతిక నిర్మాతలు. ఈనాడు కొత్తగా సాహిత్యక్షేత్రంలో అడుగుపెట్టే యువతీయువకులకు ప్రాచీన సాహిత్య ద్వారాలు దాదాపుగా మూసుకుపోయాయనే చెప్పాలి. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ఒక అధ్యయనాంశంగా విశ్వవిద్యాలయాల్లో చదువుకునే కొద్దిమంది విద్యార్థులు మినహా కొత్తతరం సాహిత్యపిపాసులకి ప్రాచీన సాహిత్యంవైపు దివిటీ పట్టే చూపే మార్గదర్శీ లేడు, ఆ సాహిత్య జ్యోతుల కాంతులవైపు విప్పుకునే నేత్రాలూ లేవు.