Sri Sri Cinema Patalu
Sri Sri (Srirangam Srinivasa Rao). / శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) · Novels

Price: Rs. 162. ఎట్టకేలకు "శ్రీశ్రీ ప్రచురణలు" ప్రారంభిస్తున్నాను. "ఈ పని ఎప్పుడో జరగవలసిందన్నారు మిత్రులు "Better late than never" అనుకున్నాను నేను. ఇకమీద నా పుస్తకాలన్నీ (ఇదివరకు రాసినవి, ఇక ముందు రాయబోయేవీ) నేనే ప్రచురించదలుచుకున్నాను. వాటిని "శ్రీశ్రీ లైబ్రరీ" ద్వారా పాఠకులకు నేనే అందజేయబోతున్నాను. ఈ సినిమా పాటలు గ్రంథరూపంగా వెలువడటానికి కొందరు విస్సన్నపేట సహృదయులు (ముఖ్యంగా సంకలనకర్త) కారణం. వారందరికీ నా కృతజ్ఞత. ఈ పుస్తకాన్ని అచ్చు వెయ్యడంలో శ్రద్ధా. శ్రమా తీసుకున్న "స్వాతి" అధిపతి వేమూరి బలరామ్ గారికి, అలంకారాలు సమకూర్చిన ఆర్టిస్ట్ టీ.వీ. గారికీ నా కృతజ్ఞత. ఈ ఉద్యమంలో నాతో సహకరిస్తున్న స్నేహితులందరికీ నా కృతజ్ఞత.