Sri bhagavadgita
Editor · History

Price: Rs. 225. ఒక వైపు పదకొండు అక్షౌహిణుల కౌరవ సైన్యం... ఇంకొకవైపు ఏడు అక్షౌహిణుల పాండవసైన్యం... కురు - పాండవ సంగ్రామానికి సర్వం సన్నద్ధమైన వేళ అది. యుద్ధ భేరీలు మోగుతున్నాయి... శంఖారావాలు ప్రతిధ్వనిస్తున్నాయి... అట్టి ఉద్విగ భరిత సమయంలో గాండీవాన్ని జారవిడుస్తూ " నేనీ యుద్ధం చెయ్యను." అన్నాడు పార్థుడు రథాగ్రంపైన విజయపతాక మధ్యన పరివేష్టితుడైవున్న హనుమంతుడు ఉలిక్కిపడ్డాడు... తన దివ్యదృష్టితో యుద్ధ విశేషాల్ని చూస్తూ ధృతరాష్ట్రుడికి యధాతధంగా వివరిస్తున్న సంజయుడు తృళ్లి పడ్డాడు. 'మహాభారతం' లో కురుక్షేత్ర సంగ్రామాన్ని చేర్చడానికి ఆత్మజ్ఞాన దృష్టితో తిలకిస్తున్న వేదవ్యాసుడు నిశ్చేష్టుడయ్యాడు. కానీ... ఆ మహాసంగ్రామాన్ని నిశ్చయించిన పరమాత్ముడు.. శ్రీ కృష్ణుడు.. ఏమాత్రం చలించలేదు పైగా... పద్దెనిమిది రోజులు జరిగే ఆ మహాసంగ్రామానికి ఇరువైపులా మోహరించిన పద్ధెనిమిది అక్షౌహిణుల అపార సేనాసముద్రం నడుమ.. నిశ్చలంగా, నిశ్చింతగా నిల్చి. పద్ధెనిమిది నిమిషాలపాటు పార్థుడికి ఉపదేశించిన.. శ్రీకృష్ణ జ్ఞానామృత గానమే ... పద్ధెనిమిది అధ్యాయాలు గల 'భగవద్గీత.'... ఆ జ్ఞానామృతానికి శులభ వచన తాత్పర్యమే ' శ్రీ భగవద్గీత' భక్తితో చదవండి.. భగవత్సాక్షాత్కారాన్ని పొందండి.